Sun Dec 22 2024 21:43:30 GMT+0000 (Coordinated Universal Time)
ధనుష్కకు గ్రేట్ రిలీఫ్
శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు గ్రేట్ రిలీఫ్ దక్కింది. ఆస్ట్రేలియా కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది
శ్రీలంక క్రికెటర్ ధనుష్క గుణతిలకకు గ్రేట్ రిలీఫ్ దక్కింది. ఆస్ట్రేలియా కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో ఆయన పెద్ద కేసు నుంచి బయటపడ్డారు. ఒక మహిళపై అత్యాచారం కేసులో శ్రీలంక క్రికెటర్ గుణతిలకను ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. టీ 20 ప్రపంచకప్ ఆడేందుకు వెళ్లిన గుణతిలక ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆయన తర్వాత షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చారు.
అత్యాచారం కేసులో...
ఈ కేసులో తాజాగా ఆయనకు పెద్ద ఊరట లభించింది. ఆస్ట్రేలియా కోర్టు తీర్పును వెలువరించింది. మహిళపై అత్చాచార ఆరోపణలను కొట్టిపారిేసింది. ఆయన ఈ కేసులో నిర్దోషి అని ప్రకటించింది. న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో ధనుష్క గుణ తిలక సంతోషం వ్యక్తం చేశారు. అన్నింటికీ తీర్పే సమాధానమన్న ఆయన తన జీవితాన్ని ఇక నుంచి సంతోషంగా గడుపుతానని తెలిపాడు. లంక తరుపున క్రకిెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా ఆయన తెలిపాడు.
Next Story