Sun Dec 22 2024 17:56:03 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ పెళ్లిపై ట్విస్ట్ ఇచ్చిన సునీల్ శెట్టి
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అనే చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందా అనే చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి, కేఎల్ రాహుల్ ప్రేమలో ఉన్నారు. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట తొందర్లోనే పెళ్లిపీటలెక్కే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై సునీల్ శెట్టి స్పందించారు. పిల్లలు కోరుకున్నట్లు త్వరలోనే వివాహం జరిపిస్తామని.. పెళ్లనేది ఒకటి రెండు రోజుల్లో జరిగేది కాదని అన్నారు.
అతియా శెట్టి, కేఎల్ రాహుల్ గత కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నారు. ఈ జంట తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. సునీల్- మనా శెట్టిల కుమార్తె అతియా నటి కాగా.. KL రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్, భారత జాతీయ జట్టు వైస్ కెప్టెన్. అతియా తండ్రి, సునీల్ శెట్టి వారి వివాహం జరుగుతుంది కానీ ఇప్పుడు కాదని స్పష్టం చేశారు. KL రాహుల్ వరుస పర్యటనలతో షెడ్యూల్ని కలిగి ఉన్నాడని, పెళ్లి చేసుకోవడానికి ఖాళీ సమయం లేదని చెప్పాడు. కేఎల్ రాహుల్ రానున్న రోజుల్లో ఏషియా కప్, ప్రపంచ కప్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టూర్లో భారత్ తరఫున ఆడనున్నాడు. ఈ బిజీ షెడ్యూల్లో అతనికి కేవలం ఒకటి రెండు రోజులు మాత్రమే ఖాళీ ఉన్నది. రెండు రోజుల్లోనే పెళ్లి చేయడమంటే మాటలు కాదని స్పష్టం చేశారు. సమయం దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటారని.. విషయం మీకు ముందే చెబుతామని అన్నారు.
రాహుల్, అతియా.. మూడు సంవత్సరాలకు పైగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. వచ్చే మూడు నెలల్లో వివాహం చేసుకోబోతున్నారని అతియా శెట్టికి సన్నిహితమైన వ్యక్తులు చెప్పారు. పెళ్ళికి సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. "రాహుల్ తల్లిదండ్రులు ఇటీవల అతియా కుటుంబాన్ని కలవడానికి ముంబైకి వచ్చారు. పెళ్లి వచ్చే మూడు నెలల్లో ముంబైలో జరగనుంది. రెండు కుటుంబాలకు ఈ పెళ్లి గొప్ప వేడుక అవుతుంది. పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని వధువు స్వయంగా పర్యవేక్షిస్తుంది" అని కథనాలు వచ్చాయి. గత సంవత్సరం అహాన్ శెట్టి.. తొలి చిత్రం తడప్ ప్రీమియర్ సందర్భంగా అతియా శెట్టి, KL రాహుల్ కలిసి మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు.
News Summary - Suniel Shetty confirms Athiya Shetty KL Rahul wedding
Next Story