Sun Dec 22 2024 21:22:42 GMT+0000 (Coordinated Universal Time)
కోహ్లీ గురించి ఆ మాట చెప్పిన గవాస్కర్.. ఊహించుకోలేకపోతున్న అభిమానులు
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే! రెండో బిడ్డ జననం కోసం ఈ సిరీస్ మొత్తానికి విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. ఇటీవలే విరాట్ కోహ్లీ- అనుష్క దంపతులకు అబ్బాయి జన్మించాడు. విరుష్క దంపతులు కొన్నేళ్ల క్రితం వామికకు జన్మనిచ్చారు. తాజాగా అకాయ్ జననం సందర్భంగా భార్య అనుష్కశర్మ పక్కన ఉండాలని భావించాడు కోహ్లీ. అందుకే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. నాలుగో టెస్టులో టీమిండియా విజయం సాధించి సిరీస్ గెలుచుకోవడంపై విరాట్ స్పందించాడు. ఇంగ్లండ్‌పై భారత యువ జట్టు అద్భుత రీతిలో గెలుపొందిందని కొనియాడాడు. ఆటగాళ్ల పట్టుదల, అంకిత భావమే.. కఠిన సవాళ్లను దాటి ఇక్కడిదాకా తీసుకువచ్చిందని విరాట్ ప్రశంసించాడు.
ఇదిలా ఉండగా భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి. ఇంగ్లండ్‌పై టెస్ట్ సిరీస్‌లో ఆడకపోవడంపై సునీల్ గవాస్కర్ మాత్రం విరాట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ విరామం తర్వాత క్రికెట్ ఆడబోతున్న విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఆడతాడా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ బహుశా ఐపీఎల్‌కు కూడా దూరమయ్యే అవకాశం ఉంది.. ఏదో ఒక కారణం వల్ల అతను ఆడకపోవచ్చని అన్నారు గవాస్కర్.
ఐపీఎల్2024 ఎడిషన్ మార్చి 22న ఆరంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. విరాట్ కోహ్లీని తిరిగి మైదానంలో ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో సునీల్ గవాస్కర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఆర్సీబీ అభిమానులకు, క్రికెట్ అభిమానులకు షాక్ ఇస్తున్నాయి.
Next Story