Mon Dec 23 2024 05:17:06 GMT+0000 (Coordinated Universal Time)
రోహిత్, షమీ మాత్రమే వచ్చి ప్రాక్టీస్ చేశారు.. సునీల్ గవాస్కర్ గుస్సా
భారతజట్టు ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మ్యాచ్ ను ఆడబోతోంది. కీలకమైన మ్యాచ్‌కు ముందు జట్టు ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్‌ను కలిగి ఉంది. ప్రాక్టీస్‌కు వచ్చిన వారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, పేస్‌మెన్ మహమ్మద్ షమీ మాత్రమే ఉన్నారు. అక్టోబరు 17న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది, న్యూజిలాండ్‌తో రెండో వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.
భారత మాజీ కెప్టెన్, బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు జట్టు కోసం ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించాలనే నిర్ణయాన్ని తాను ఏకీభవించడం లేదని చెప్పాడు. ఆటగాళ్లు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు.. కానీ దీన్ని నేను అంగీకరించను. టోర్నమెంట్ ప్రారంభంలో మీరు మీ వార్మప్ మ్యాచ్ ఆడితే సరిపోదని అన్నారు. "మెల్బోర్న్కు వచ్చి ఒక రోజు సెలవు తీసుకున్న తర్వాత, మరుసటి రోజు మీరు ప్రాక్టీస్ చేయకూడదా?" అని గవాస్కర్ ప్రశ్నించారు.
ప్రాక్టీస్ కోసం బయటకు రాని వారు మ్యాచ్ విన్నర్లుగా మారవచ్చు. కానీ మీరు జట్టుగా రాణించాలంటే మాత్రం ప్రాక్టీస్ ఉండాలని అన్నారు. ఒక ఆప్షన్ ఇవ్వడం అనేది కెప్టెన్, కోచ్ నిర్ణయమని నేను నమ్ముతున్నాను. మీరు మునుపటి గేమ్‌లో వంద స్కోర్ చేసి వుంటే.. కెప్టెన్, కోచ్ మీకు ప్రాక్టీస్ చేయకూడదనే ఎంపికను ఇవ్వగలరు.. అలాంటి సమయాల్లో మీరు ప్రాక్టీస్‌కు రాకూడదనుకుంటే ఫర్వాలేదని అన్నారు. అదే విధంగా 20-30 ఓవర్లు బౌలింగ్ చేసి భుజం నొప్పిగా అనిపించిన బౌలర్ కు ఆ ఆప్షన్ కూడా ఇవ్వవచ్చు. ఇలాంటి సమయాల్లో ఆటగాళ్లకు ఆప్షన్ ఇవ్వకూడదు. ఆ ఎంపిక ఎప్పుడూ ఉండకూడదు. కెప్టెన్, కోచ్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇది భారత క్రికెట్‌పై ఎన్నిసార్లు ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. టోర్నమెంట్ మధ్యలో విరామం తీసుకోవడం బాగుంటుంది. ఆ సమయంలో సినిమాకి వెళ్లండి, క్రికెట్ నుండి వేరే వాటిపై దృష్టి మళ్లించండి.. అంతేకానీ టోర్నమెంట్ ప్రారంభంలో ఐచ్ఛిక ప్రాక్టీస్ సెషన్ అవసరం లేదని అన్నారు. ఒకవేళ మ్యాచ్ ముందు రోజు వచ్చి ప్రాక్టీస్ చేయాలని అనుకుంటుంటారు.. ఆరోజు వర్షం పడితే ఏంటి పరిస్థితి..? అని ప్రశ్నించారు గవాస్కర్. దీంతో మ్యాచ్ కు ముందు కనీస ప్రాక్టీస్ ఆటగాళ్లకు దక్కదు.
Next Story