Sun Dec 22 2024 17:58:44 GMT+0000 (Coordinated Universal Time)
తొలి టీ20కే భారత్ కు ఎదురుదెబ్బ.. పంత్ కు కెప్టెన్సీ
నేడు భారత్ - దక్షిణాఫ్రికాతో టీ 20 జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది
నేడు భారత్ - దక్షిణాఫ్రికాతో టీ 20 జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ నేడు జరగనుంది. అయితే మ్యాచ్ కు రోహిత్ శర్మ, విరాట్ కొహ్లి దూరంగా ఉన్నారు. వారికి సెలక్టర్లు ఈ ఐదు టీ 20 సిరీస్ లకు విశ్రాంతి ఇచ్చారు. వాస్తవానికి ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ కూడా దూరంగా ఉన్నారు. గాయం కారణంగా ఈ మ్యాచ్ కు రాహుల్ నాయకత్వం వహించరని బీసీసీఐ ప్రకటించింది.
రిషబ్ పంత్....
అయితే ఐపీఎల్ లో ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరించిన కీపర్ రిషబ్ పంత్ కు కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది. హార్ధిక్ పాండ్యాకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. కేఎల్ రాహుల్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది. మరోవైపు స్పిన్నర్ కులదీప్ యాదవ్ కూడా సిరిస్ మొత్తంలో ఆటడం లేదు. దక్షిణాఫ్రికాతో గాయాలతో కీలక ఆటగాళ్లు దూరం కావడంతో టీమిండియా క్రికెటర్లు ఏ మేరకు సక్సెస్ సాధిస్తారన్నది చూడాలి.
Next Story