Mon Dec 23 2024 10:32:55 GMT+0000 (Coordinated Universal Time)
విండీస్ ను చిత్తు చేసిన స్కాట్లాండ్
T20 ప్రపంచ కప్ 2022 లో విండీస్ కు ఘోర ఓటమి మొదలైంది. సోమవారం నాడు హోబర్ట్‌లో స్కాట్లాండ్ చేతిలో 42 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రెండుసార్లు టీ20 ఛాంపియన్లు గా ఉన్న విండీస్ ఘోరమైన ఓటమితో టోర్నమెంట్ ను ప్రారంభించింది. విజయానికి 161 పరుగుల లక్ష్యాన్ని విధించగా 108 పరుగులకు ఆలౌటైంది. బుధవారం జింబాబ్వే , శుక్రవారం ఐర్లాండ్‌తో జరగబోయే క్వాలిఫైయింగ్ మ్యాచ్‌లలో ఏ మాత్రం తేడా కొట్టినా విండీస్ టోర్నమెంట్ నుండి అవుట్ అవ్వాల్సిందే.
హోబర్ట్‌లోని బల్లెరివ్ ఓవల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సే తన ఎనిమిదో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అతను 53 బంతుల్లో 124.52 స్ట్రైక్ రేట్‌తో 66 పరుగులు చేశాడు. క్రిస్ గ్రీవ్స్ 16 పరుగులతో నాటౌట్‌గా వెనుదిరిగాడు. మెక్లియోడ్ 23, జోన్స్ 20 పరుగులు చేశారు. స్మిత్ ఖాతాలో ఒక వికెట్ చేరింది. కాగా, హోల్డర్, జోసెఫ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
160 పరుగులు టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ జట్టును కేవలం 118 పరుగులకే అవుట్ అయింది. దీంతో స్కాట్లాండ్ 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్ బౌలర్లలో మైకేల్ లీష్, బ్రాడ్ వీల్, మార్క్ వాట్ తలో 2 వికెట్లు తీశారు. జోష్ డేవీ ఒక వికెట్ పడగొట్టాడు.
Next Story