Sat Nov 23 2024 05:08:23 GMT+0000 (Coordinated Universal Time)
T20WorldCup: టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది
ఐసీసీ T20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి జరగనున్న
ఐసీసీ T20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్ వచ్చేసింది. జూన్ 1 నుంచి జరగనున్న ఈ మెగా టోర్నీ జూన్ 29 న ముగుస్తుంది. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిధ్యమిస్తున్నాయి. జూన్ 1న టోర్నమెంట్ తొలి మ్యాచ్ లో ఆతిధ్య అమెరికా.. కెనడాతో తలపడుతుంది. జూన్ 29న బార్బడోస్ ఫైనల్కు ఆతిథ్యం ఇవ్వనుంది. గ్రూప్ 'ఏ' లో పాకిస్తాన్, కెనడా, ఐర్లాండ్, అమెరికా, భారత్ లు ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియా గ్రూప్ 'బి' లో ఉన్నాయి. ఆతిథ్య వెస్టిండీస్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా గ్రూప్ 'సి' లో ఉన్నాయి. గ్రూప్ 'డి' లో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాడ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి.
భారత్ తొలి మ్యాచ్ జూన్ 5 న ఐర్లాండ్ తో ఆడనుంది. భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9 న న్యూయార్క్ సిటీలో తలపడనున్నాయి. జూన్ 12 న న్యూయార్క్ లో అమెరికాపై, 15 న కెనడాతో ఫ్లోరిడాలో భారత్ లీగ్ మ్యాచ్ లు ఆడుతుంది. భారత్ తమ గ్రూప్ మ్యాచ్ లన్నీ అమెరికాలోనే ఆడబోతుంది. T20 ప్రపంచ కప్ 2024 మొదటిసారిగా 20 జట్లతో కొత్త ఫార్మాట్ లో ఆడనుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాలు సూపర్ ఎయిట్ దశకు చేరుకుంటాయి. ఈ దశలో మిగిలిన జట్లను నాలుగు గ్రూపులుగా విభజిస్తారు. ఈ గ్రూపుల నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీ-ఫైనల్కు చేరుకుంటాయి.
Next Story