Mon Nov 25 2024 21:32:46 GMT+0000 (Coordinated Universal Time)
INDvsPAK: భారత్ ప్లేయింగ్ లెవెన్ ఇదేనా..?
మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆదివారం పాకిస్థాన్‌తో టీ20 ప్రపంచకప్ లో తొలిమ్యాచ్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం ఉండడంతో.. ప్లేయింగ్ లెవెన్ విషయంలో కొన్ని మార్పులు అవసరం. నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండవ T20I కోసం రిషబ్ పంత్‌తో సహా ఏడుగురు బ్యాటర్లను భారత్ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే, ఆ మ్యాచ్ ను వెట్ అవుట్‌ఫీల్డ్ కారణంగా 8 ఓవర్ల మ్యాచ్ గా తగ్గించారు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. తాజాగా మహ్మద్ షమీ కూడా జట్టులోకి రావడంతో భారత్ ప్లేయింగ్ లెవెన్ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నారు.
KL రాహుల్: ఆస్ట్రేలియాలో దిగినప్పటి నుండి రాహుల్ ఫామ్ గురించి చాలా చర్చ జరుగుతూ ఉంది. ప్రాక్టీస్ గేమ్‌లలో వెస్ట్రన్ ఆస్ట్రేలియాపై మొదట 74 పరుగులు చేసిన రాహుల్, వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై 57 పరుగులు బాదాడు.
రోహిత్ శర్మ: ఇటీవలి కాలంలో భారత కెప్టెన్ నిలకడగా పెద్ద స్కోర్లు నమోదు చేయలేదు, కానీ రోహిత్ మంచి ఆరంభాన్ని అందించగలడు. అవతలి ఎండ్‌లో వికెట్లు త్వరగా పడిపోతే నిదానంగా కూడా ఆడగలడు. రోహిత్ 10 ఓవర్ల పాటూ క్రీజ్ లో ఉంటే మ్యాచ్ స్వరూపమే మారిపోతుందని అందరూ అంటారు.
విరాట్ కోహ్లి: ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే తన ఫామ్ ను తిరిగి సొంతం చేసుకున్నాడు. పాక్ మీద కోహ్లీ రాణిస్తే.. అభిమానులకు అంతకన్నా కిక్ మరొకటి ఉండదు. ముఖ్యంగా పెద్ద గ్రౌండ్ లో కోహ్లీ రన్స్ తిరుగుతూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలడు.
సూర్యకుమార్ యాదవ్: ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న అత్యుత్తమ T20 బ్యాటర్, సూర్యకుమార్ యాదవ్ నిలకడగా ఆడితే భారత్ భారీ స్కోర్ చేయడం కష్టమేమీ కాదు. ICC T20I ర్యాంకింగ్స్‌లో నం.2 ర్యాంక్ బ్యాటర్, సూర్యకుమార్ జట్టుకు చాలా అవసరమైన ఆటగాడు.
హార్దిక్ పాండ్యా: ఆల్ రౌండర్ బ్యాట్- బాల్ తో మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను ప్రతి మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేయగలడా అనేది సందేహమే. వార్మప్ మ్యాచ్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు పాండ్యా.
దినేష్ కార్తీక్: 37 ఏళ్ల దినేష్ కార్తీక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇన్నింగ్స్‌లోని చివరి ఐదు ఓవర్లలో ఎక్కువగా బ్యాటింగ్‌కు వచ్చే కార్తీక్.. మొదటి బంతి నుండి బాదుడే తన పనిగా పెట్టుకున్నాడు.
అక్షర్ పటేల్: గాయపడిన రవీంద్ర జడేజాకు అక్షర్ పటేల్ సరైన ప్రత్యామ్నాయం. అక్షర్ కొత్త బంతితోనూ బౌలింగ్ చేయగలడు. బ్యాట్‌తో, అతను కీలకమైన పరుగులు రాబట్టగలడు.
భువనేశ్వర్ కుమార్: ఆస్ట్రేలియాలో, బంతి స్వింగ్ చేయగలడు, పవర్‌ప్లేలో వికెట్లు తీయగలడు కాబట్టి భువనేశ్వర్ బౌలింగ్ కూడా భారత్ కు చాలా ముఖ్యం.
మహ్మద్ షమీ: గత సంవత్సరం T20 ప్రపంచ కప్ నుండి పేసర్ అంతర్జాతీయ T20I ఆడలేదు, ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్‌లో బౌలింగ్ చేసిన ఒక ఓవర్ సంచలనమైంది. బుమ్రా లోటును తీర్చే సత్తా షమీకి ఉందని అంటున్నారు.
అర్ష్‌దీప్ సింగ్: లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి యార్కర్లను అందించడంలో నైపుణ్యం ఉంది. బౌలింగ్ పరంగా అర్ష్ దీప్ రాణిస్తున్నా.. ఒత్తిడి ఉన్న సమయాల్లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడనేదే ఇక్కడ కీలకమైంది.
యుజ్వేంద్ర చాహల్: లెగ్ స్పిన్నర్లు ఆస్ట్రేలియా పరిస్థితులలో బౌలింగ్‌ను ఆస్వాదిస్తారు. పెద్ద బౌండరీలు ఉండడంతో స్పిన్నర్ ను అటాక్ చేయడం కష్టం.. ఎంత భారీ షాట్ ఆడినా ఫీల్డర్ చేతుల్లోకి బంతి వెళ్లే అవకాశం ఉంటుంది. చాహల్ స్పిన్ కూడా భారత్ కు ప్లస్ గా మారవచ్చు.
Next Story