Sat Dec 21 2024 13:01:47 GMT+0000 (Coordinated Universal Time)
నేడు నెదర్లాండ్స్ తో తలపడనున్న భారత్.. చాహల్ కు ఛాన్స్ దక్కేనా..?
టీ20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన సూపర్ 12 పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి ఏడు ఓవర్లలోనే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ ఔట్ కావడంతో వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేసి భారత్ కు విజయాన్ని అందించాడు. నాలుగు వికెట్ల తేడాతో టీమ్ ఇండియాకు విజయాన్ని అందించాడు.
టీమ్ ఇండియా గురువారం నాడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. పాకిస్థాన్ తో మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ స్థానంలో అక్షర్ పటేల్ ను తీసుకుంది. అక్షర్ పటేల్ బ్యాట్, బాల్ రెండింటిలోనూ మంచి ప్రదర్శనను అందించడంలో విఫలమయ్యాడు. దీంతో నెదర్లాండ్స్‌తో జరగబోయే మ్యాచ్ లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చాహల్ తన స్థానాన్ని సొంతం చేసుకుంటాడా అనేది ఆసక్తికరంగా మారింది. సిడ్నీ క్రికెట్ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 12:30 కు భారత్ నెదర్లాండ్స్ తో తలపడనుంది.
స్క్వాడ్లు:
భారత జట్టు: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, రిషబ్ పంత్, దీపక్ హుడా , హర్షల్ పటేల్
నెదర్లాండ్స్ స్క్వాడ్: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడే, కోలిన్ అకెర్మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్, రోలోఫ్ వాన్ టిమ్మ్ డెర్ మెర్వే, వాన్ డెర్ గుగ్టెన్, స్టీఫన్ మైబర్గ్, తేజ నిడమనూరు, బ్రాండన్ గ్లోవర్
Next Story