Tue Dec 24 2024 00:54:27 GMT+0000 (Coordinated Universal Time)
కన్ఫర్మ్.. దీపక్ చాహర్ అవుట్
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో పేసర్ దీపక్ చాహర్ ఉంటాడని భావించగా.. అతడు వెన్ను గాయం కారణంగా ఈవెంట్‌కు దూరమయ్యాడని బీసీసీఐ వర్గాలు బుధవారం తెలిపాయి. ప్రపంచ కప్‌కు స్టాండ్‌బై ప్లేయర్ అయిన చాహర్ ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాన్ని కోల్పోగా.. జాతీయ సెలెక్టర్లు పేసర్లు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లను జట్టులో చేరమని కోరారు. "దీపక్ ఫిట్‌గా ఉండటానికి కొంత సమయం పడుతుంది. అతడి వెన్ను నొప్పి సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. అతని చీలమండ బాగానే ఉంది. అక్కడ ఎలాంటి సమస్య లేదు. కాబట్టి, బీసీసీఐ మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లను పంపుతోంది, "అని బీసీసీఐ అధికారి ఒకరు పిటిఐకి తెలిపారు. బుమ్రా స్థానంలో ముగ్గురు పేసర్లలో ఒకరు 15 మందితో కూడిన జట్టులోకి రానున్నాడు.
దీపక్ చాహర్ పూర్తిస్థాయిలో ఫిట్నెస్ సాధించేందుకు సమయం చాలానే పడుతుందని, అతడి వెన్ను సమస్య మళ్లీ తీవ్రమైందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. షమీ, శార్దూల్, సిరాజ్‌లను ఆస్ట్రేలియా పంపుతున్నట్టు తెలిపారు. గాయపడి జట్టుకు దూరమైన బుమ్రా స్థానంలో తుది జట్టులోకి వచ్చే చాన్స్ సీనియర్ అయిన షమీకే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కాగా, తాజాగా ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ కూడా జట్టుకు దూరమయ్యాడు. ప్రపంచకప్ జట్టులో స్టాండ్‌బైగా ఉన్న చాహర్ బుమ్రా స్థానంలో జట్టులోకి వస్తాడని భావించారు. అయితే, వెన్ను గాయం కారణంగా అతడు కూడా జట్టుకు దూరమయ్యాడు.
Next Story