Fri Dec 20 2024 16:47:43 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్.. హార్దిక్ పాండ్యా దూరమేనా?
హార్దిక్ పాండ్యా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. హార్దిక్ మూడు బంతులు వేసిన తర్వాత
ప్రపంచకప్ 2023లో భాగంగా భారత జట్టు న్యూజిలాండ్ తో తలపడనుంది. ఆదివారం ధర్మశాల వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. న్యూజిలాండ్, భారత్ ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధించాయి. ఈ మ్యాచ్ కు ముందు భారతజట్టుకు షాకింగ్ న్యూస్ అందింది. టీమిండియాలో కీలక ఆటగాడు, ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా ఈ మ్యాచ్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భాగంగా పాండ్యా, తన బౌలింగ్ లో బంతిని ఎడమ కాలుతో ఆపే ప్రయత్నంలో చీలమండకు గాయమైంది. పాండ్యా మొదటి ఓవర్ వేస్తున్నప్పుడే ఇది చోటు చేసుకుంది. సపోర్ట్ స్టాఫ్ సాయంతో పాండ్యా మైదానాన్ని వీడాడు. స్కానింగ్ చేయగా, చీలమండ గాయం బయటపడింది.
ఈ గాయం పెద్దది కాదని భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. గాయం కారణంగా పాండ్యా కివీస్ మ్యాచ్ కు దూరం కానున్నట్టు తెలుస్తోంది. పాండ్యా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లి, అక్కడ ఇంగ్లండ్ స్పెషలిస్ట్ వైద్యుల సలహా తీసుకోనున్నాడు. పూణెలో వైద్యులు ప్రాథమికంగా పాండ్యాకు ఇంజెక్షన్లు ఇవ్వడంతో పాటు, వారం రోజులు విశ్రాంతి అవసరమని సూచించారని నేషనల్ మీడియా చెబుతోంది. అక్టోబర్ 29న ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ నాటికి పాండ్యా కోలుకోవచ్చని తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా గాయపడటంతో కోహ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. హార్దిక్ మూడు బంతులు వేసిన తర్వాత అతని కాలికి గాయమైంది. దీంతో ఆ ఓవర్‌ను కోహ్లీ పూర్తి చేశాడు. మూడు బంతులు వేశాడు. ఈ మూడు బంతుల్లో ఒక బంతిని డాట్ చేయగా.. మిగతా రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇచ్చాడు. కోహ్లీ ఆరేళ్ల తర్వాత వన్డేల్లో బౌలింగ్ వేశాడు.
Next Story