Mon Dec 23 2024 13:03:51 GMT+0000 (Coordinated Universal Time)
టీ20 సిరీస్ వైట్ వాష్.. శ్రీలంక ఎంత ప్రయత్నించినా?
శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో కూడా టీం ఇండియా ఘన విజయం సాధించింది
ముచ్చటగా మూడో మ్యాచ్ గెలిచి టీం ఇండియా వైట్ వాష్ చేసింది. శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో కూడా టీం ఇండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బ్యాటింగ్, బౌలింగ్ లో టీం ఇండియా పటిష్టంగా ఉండటంతో దాని గెలుపును అడ్డుకునేందుకు శ్రీలంక చేసిన ఫీట్లు వర్క్ అవుట్ కాలేదు. మూడో వన్డేలోనే శ్రీలంకపై టీం ఇండియా సునాయాస విజయాన్ని సాధించింది.
సొంత గడ్డపై.....
సొంత గడ్డపై భారత్ గర్జిస్తుంది. మొన్న వెస్టిండీస్, నేడు శ్రీలంక జట్లను ఉతికి ఆరేస్తుతంది. మూడో టీ 20లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 146 పరుగులు చేసింది. శ్రీలకం బ్యాటింగ్ పూర్తయిన వెంటనే భారత్ విజయం ఖాయం అనిపించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ వెంటనే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. సంజూశాంసన్, ఇషాంత్ కిషన్ కుదురుకున్నారనిపించేలోగా శాంసన్ అవుటయ్యాడు. హుడా,వెంకటేశ్ అయ్యర్ కూడా వెనువెంటనే పెవిలియన్ కు చేరడంతో జడేజా, ఇషాంత్ కిషన్ లు కలసి ఆరు వికట్ల తేడాతో టీం ఇండియాను విజయపథాన నిడిపారు.
Next Story