Mon Dec 23 2024 15:59:37 GMT+0000 (Coordinated Universal Time)
హడలెత్తించిన టీమిండియా.. 62 రన్స్ కే కుప్పకూలిన కివీస్
టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కివీస్ ను హడలెత్తించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను 62 పరుగులకే కుప్పకూల్చారు
ముంబై టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు కివీస్ జట్టును హడలెత్తించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టును 62 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియాకు 263 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లైన రవిచంద్రన్ అశ్విన్4, మహ్మద్ సిరాజ్ 3, అక్షర్ పటేల్ 2, జయంత్ యాదవ్ 1 వికెట్లు తీసి తమ సత్తా చాటారు. ఇక కివీస్ జట్టులో అయితే కైల్ జేమీసన్ 17 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కివీస్ జట్టు తాత్కాలిక కెప్టెన్ టామ్ లాథమ్ 10 పరుగులు చేయగా.. మిగతా వారంతా సింగిల్ డిజిట్ స్కోర్ తో సరిపెట్టేశారు.
తొలి ఇన్నింగ్స్ లో....
భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేయగా, ఆపై ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు ఏదీ కలిసిరాలేదు. ఓపెనర్లు విల్ యంగ్ (4), టామ్ లాథమ్ (10) లను అవుట్ చేసి పేసర్ సిరాజ్ టీమిండియాలో ఉత్సాహాన్ని నింపాడు. ఇక అక్కడి నుంచి కివీస్ పతనం మొదలైంది. టీమిండియా బౌలర్లు ఒకరిని మించి మరొకరు ఊహించని రీతిలో బౌలించ్ చేసి బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీశారు. టీమిండియా బౌలర్లలో అశ్విన్ దే ది బెస్ట్ బౌలింగ్. 8 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 8 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
- Tags
- inda
- newzealand
Next Story