Indian vs Bangladesh Champions Trophy : బంగ్లాదేశే భయపెట్టించింది కదయ్యా.. మీరేందయ్యాసామీ
భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా సునాయాసంగా విజయం సాధించింది

భారత్ - పాకిస్థాన్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీం ఇండియా సునాయాసంగా విజయం సాధించింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాకిస్థాన్ బ్యాటర్లను కట్టడి చేయడంలో మన బౌలర్లు సక్సెస్ అయ్యారు. తొలుత ఊపు చూసి పాకిస్థాన్ 280 పరుగులు చేస్తుందని భావించినా 241పరుగులకే పాకిస్థాన్ ను భారత్ బౌలర్లు ఆల్ అవుట్ చేయగలిగారు. భారత్ విజయలక్ష్యం 242 పరుగులుగా మారింది. హార్ధిక్ పాండ్యాకు రెండు, కులదీప్ యాదవ్ కు మూడు, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాకు చెరో వికెట్ తీశారు. రెండు రనౌట్లు చేయడంతో పాకిస్థాన్ తక్కువ స్కోరుకే ఆల్ అవుట్ అయింది. . పాకిస్థాన్ బ్యాటర్లలో రిజ్వాన్, షకీల్ లు మాత్రమే రాణించగలిగారు. షకీల్ ఒక్కడే పాక్ బ్యాటర్లలో అర్ధ సెంచరీ చేశాడు. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.