Wed Mar 26 2025 19:17:43 GMT+0000 (Coordinated Universal Time)
Chmpions Trophy : టెన్షన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీం ఇండియా
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఉత్కంఠ మధ్య చివరకు టీం ఇండియా విజేతగా నిలిచింది

భారత్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో ఉత్కంఠ మధ్య చివరకు టీం ఇండియా విజేతగా నిలిచింది. రెండు బలమైన జట్లు తలపడినప్పడు మైదానంలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్నే నిన్న చూడగలిగాం. టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే మన బౌలర్లు వరసగా పెవిలియన్ బాట పట్టించడంతో తక్కువ స్కోరుకు మాత్రమే పరిమితం చేయగలిగింది. 251 పరుగులకే భారత్ బౌలర్లు న్యూజిలాండ్ ను కంట్రోల్ చేయగలిగారు. అయితే దుబాయ్ పిచ్ లో ఇది భారీ స్కోరు అని చెప్పాలి. దీనిని రీచ్ కావాలంటే భారత్ బ్యాటర్లు చెమటోడ్చాల్సిందేనని తొలి నుంచి అంచనా వేసిందే.
బౌలర్లు తక్కువకే...
భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ చెరి రెండేసి వికెట్లు తీయగా, షమి, జడేజా తలో వికెట్ తీశారు. ఆట ప్రారంభమయిన వెంటనే మంచి ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్ర, విలియమ్సన్ లను కులదీప్ యాదవ్ అవుట్ చేయగలిగాడు. దీంతో ఎక్కువ స్కోరు కష్టమేనని అప్పుడే అనిపించింది. యంగ్ ను వరుణ్ పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో 251 పరుగులకే యాభై ఓవర్లకు రన్స్ న్యూజిలాండ్ చేయగలిగింది. రచిన్ రవీంద్ర 37, మిచెల్ 63, ఫిలిప్స్ 34, బ్రాస్ వెల్ 63 పరుగులు చేయగలిగారు. శాంటర్న్ ను రన్ అవుట్ చేయడంతో కివీస్ కథ ముగిసింది. ఆట ప్రారంభమయిన తొలి పవర్ ప్లేలో చేసిన పరుగులు చూసి మూడు వందలు దాటుతుందని అంచనా వేసినా తక్కువకే పూర్తి చేయగలిగింది.
ఉత్కంఠ రేపినా...
తర్వాత ఛేదనలోకి బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు శుభమన్ గిల్, రోహిత్ శర్మలు శుభారంభాన్ని ఇచ్చారు. శుభమన్ గిల్ 31 పరుగులు చేసి అవుటయ్యాడు. రోహిత్ శర్మ 76 పరుగులు చేసి వెనుదిరిగాడు. కోహ్లి ఈ మ్యాచ్ లో నిరాశపర్చాడు. వచ్చిన వెంటనే ఎల్.బి.డబ్ల్యూగా అవుటయ్యాడు. తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. శ్రేయస్ అయ్యర్ 48, 29 పరుగులు చేసి అవుట్ కావడంతో హార్థిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పై కొంత భారం పడింది. రన్ రేటు అప్పటికే ఆరుకు పైగా చేరడంతో కొంత టెన్షన్ పడినా చివరకు భారత్ దే విజయం వరించింది. భారత్ న్యూజిలాండ్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి కప్పు అందుకుంది.
Next Story