Fri Dec 20 2024 05:18:39 GMT+0000 (Coordinated Universal Time)
రోహిత్ శర్మ ఫిట్నెస్ పై కోచ్ కీలక కామెంట్లు
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి విమర్శలు వినిపిస్తూనే
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ గురించి విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ లావు గురించి పలువురు ట్రోల్ చేస్తూ ఉంటారు. అయితే అతడి బ్యాటింగ్ కారణంగా ఈ విమర్శలకు సమాధానం చెబుతూ ఉంటాడు. అయితే రోహిత్ శర్మ చూడడానికి అలా కనిపిస్తాడు కానీ చాలా ఫిట్‌గా ఉంటాడని.. విరాట్ కోహ్లీతో సమంగా హిట్‌మ్యాన్ ఫిట్నెస్ ఉంటుందని చెబుతోంది కోచింగ్ బృందం. బీసీసీఐ ప్రవేశపెట్టిన యో యో టెస్టులో కూడా హిట్‌మ్యాన్ ఉత్తీర్ణత సాధిస్తున్నాడని.. బీసీసీఐ స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ అంకిత్ కాలియార్ వెల్లడించారు.
రోహిత్ శర్మ ఫిట్ ప్లేయర్. మంచి ఫిట్నెస్తో ఉంటాడని.. అతను కొంచెం బొద్దుగా కనిపిస్తాడు కానీ ఎప్పుడూ యో-యో పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడన్నారు అంకిత్. మైదానంలో రోహిత్ చురుకుదనం అద్భుతంగా ఉంటుంది. ఫిట్‌గా ఉండే క్రికెటర్ల జాబితాలో రోహిత్ కూడా ఉంటాడని అంకిత్ కాలియార్ తెలిపాడు. ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ ఒక మంచి ఉదాహరణ. అతను జట్టులో ఫిట్నెస్ సంస్కృతిని సృష్టించాడు. మీ టాప్ ప్లేయర్ చాలా ఫిట్‌గా ఉన్నప్పుడు, ఇతరులకు ఆదర్శంగా మారతారు. అతను ఇతరుల్లో విశ్వాసాన్ని నింపుతాడన్నారు. కెప్టెన్‌గా ఉన్నప్పుడు అందరూ ఫిట్‌గా ఉండేలా చూసుకున్నాడు. జట్టులో ఫిట్నెస్ అతని ప్రధాన పారామీటర్. ఆ సంస్కృతిని, క్రమశిక్షణను జట్టులో సృష్టించాడని చెప్పుకొచ్చారు అంకిత్ కాలియర్. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ విరాట్ కోహ్లీ బాటలో నడుస్తున్నాడని తెలిపారు.
Next Story