Sat Dec 21 2024 02:22:54 GMT+0000 (Coordinated Universal Time)
మనమే నెంబర్ 1
ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది టీమిండియా
ఆస్ట్రేలియాతో మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది టీమిండియా. దీంతో ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. అన్ని ఫార్మాట్లలోనూ నెంబర్ 1 టీమ్‌గా అవతరించింది. ఈ మేరకు ఐసీసీ ర్యాంకులను సవరించింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు పాకిస్థాన్ వన్డే ఫార్మాట్లో టాప్-1గా ఉండేది. ఈ మ్యాచ్ విజయంతో భారత్ అగ్రస్థానానికి చేరుకుంది. వన్డేల్లో ప్రస్తుతం టీమిండియా రేటింగ్ పాయింట్స్ 116 కాగా, 115 రేటింగ్ తో పాకిస్థాన్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (111) మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా 106 పాయింట్లతో.. ఇంగ్లండ్ జట్టు 105 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది.
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆసీస్‌ను మహ్మద్ షమీ తన కెరీర్లో అత్యుత్తమంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియా 276 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం లక్ష్య ఛేదనలో శుభ్‌మన్ గిల్ (74) మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(71), కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (50) రాణించడంతో 49 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ విజయంలో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Next Story