Sun Dec 14 2025 23:31:05 GMT+0000 (Coordinated Universal Time)
నేడు భారత్ - బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్
టీం ఇండియా బంగ్లాదేశ్ తో చివరి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమయింది. కాన్పూర్ లో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది

టీం ఇండియా బంగ్లాదేశ్ తో చివరి టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధమయింది. చెన్నై మ్యాచ్ లో గెలిచి ఊపు మీదున్న భారతజట్టు రెండో మ్యాచ్ లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని టీం ఇండియా భావిస్తుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా ఈ రెండో టెస్ట్ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ ను సమం చేయాలని అనుకుంటోంది. కాన్పూర్ లో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ప్రధాన ఆటగాళ్లురోహిత్ శర్మ, విరాట్ కొహ్లిలు అత్యధిక పరుగులు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
వర్షం పడే అవకాశం...
అయితే కాన్పూర్ లో వాతావరణ శాఖ ప్రకటించిన మేరకు వర్షం కురిసే అవకాశముందని పేర్కొనడంతో వర్షం అడ్డంకిగా మారే అవకాశముందని తెలిసింది. తొలి టెస్ట్‌లో 280 పరుగుల తేడాతో గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లోనూ సత్తా చాటాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ జరిగితే ఎవరిది గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు టీం ఇండియా ఊపుమీదుండటంతో బంగ్లాదేశ్ తొలి మ్యాచ్ లో ఓడిపోయి కొంత ఒత్తిడిలో ఉంది.
Next Story

