Mon Dec 23 2024 06:38:21 GMT+0000 (Coordinated Universal Time)
గంగూలీకి విరాట్ స్ట్రాంగ్ కౌంటర్
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లి గట్టి కౌంటర్ ఇచ్చారు
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీకి టీం ఇండియా ఆటగాడు విరాట్ కొహ్లి గట్టి కౌంటర్ ఇచ్చారు. తనకు కెప్టెన్సీ బాధ్యతలనుంచి తప్పుకోవద్దని గంగూలీ చెప్పలేదన్నారు. మీడియాతో మాత్రం గంగూలీ వేరే విధంగా చెప్పారని, బీసీసీఐ నుంచి ఇలాంటి వైఖరిని ఊహించలేదని కొహ్లి తెలిపారు. తాను వన్డేల్లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని కొహ్లి తెలిపారు.
వన్డేల్లో ఆడేందుకు...
సౌతాఫ్రికా టూర్ లో తాను పాల్గొంటానని, సెలక్టర్లకు అందుబాటులోనే ఉంటానని కొహ్లి తెలిపారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడేందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. వన్డే సిరీస్ తాను ఆడతానని చెప్పారు. కెప్టెన్ గా లేకపోయినంత మాత్రాన నిరుత్సాహ పడనని, విశ్రాంతి తీసుకునే ఆలోచన లేదని విరాట్ కొహ్లి తెలిపారు. కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం సరైనదేనని అన్నారు. సౌతాఫ్రికా వన్డే సిరీస్ లో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పారు.
Next Story