Sun Apr 06 2025 12:39:42 GMT+0000 (Coordinated Universal Time)
India vs Bangladesh Champions Trophy : తక్కువ పరుగులకే ఆల్ అవుటయ్యే బంగ్లాదేశ్ ను చేజేతులా
భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నఛాంపియన్ ట్రోఫీలో టీం ఇండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ సరిగా చేయలేదు

భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నఛాంపియన్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తొలుత 25 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటి పరిస్థితుల్లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ జారవిడిచన క్యాచ్ ను బంగ్లాదేశ్ ఆటగాళ్లు అందిపుచ్చుకున్నారు. అక్షర్ పటేల్ కు హ్యాట్రిక్ మిస్ అవ్వడమే కాకుండా బంగ్లాదేశ్ రెండు వందలకు పైగా స్కోరు చేయడానికి కారణమయింది. తర్వాత హార్ధిక్ పాండ్యా కూడా ఒక క్యాచ్ జారవిడిచాడు. కులదీప్ యాదవ్ బౌలింగ్ హార్ధిక్ పాండ్యా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ఆటగాళ్లు ఇక క్రీజును పట్టుకుని వదలలేదు. కేవలం 25 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయినప్పుడు 150 పరుగులు చేయడం కష్టంగా బంగ్లాదేశ్ కు కనిపించింది.
జట్టు స్కోరును పెంచి...
జకేర్ ఆలి, తోహిద్ హృదయ్ లు నిలదొక్కుకుని ఆడి తమ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. ఇద్దరి భాగస్వామ్యం అత్యధిక పరుగుల రికార్డు నమోదయింది. ఇద్దరూ కలసి జట్టుకు 150 పరుగుల భాగస్వామ్యాన్ని అందించగలిగారు. పేలవమైన ఫీల్డింగ్ నేడు భారత్ బ్యాటర్లలో కనిపించిందన్నది అందరి అభిప్రాయంగా ఉంది. ఒకానొక దశలో వంద పరుగులు కూడా చేయలేదని భావించిన బంగ్లాదేశ్ ను తమ తప్పులతో ఆ దేశానికి ఊపిరినిచ్చారు. బంగ్లాదేశ్ మరీ తక్కువ పరుగులు చేయకుండా భారత్ ఆటగాళ్లు భలే ఆడారన్నకామెంట్స్ నెట్టింట వినిపిస్తున్నాయి. చివరకు జకేర్ ఆలీని షమి అవుట్ చేశాడు. కోహ్లి క్యాచ్ పట్టడంతో ఇద్దరి భాగస్వామ్యం విడిపోయింది.
బంగ్లాదేశ్ పై తడబాటు...
బంగ్లాదేశ్ పై కాబట్టి ఈ ఫీల్డింగ్ లో తడబాటు సరిపోయింది. ఇక ఆడాల్సిన జట్లన్నీ పెద్ద జట్లు. పాకిస్థాన్, న్యూజిలాండ్ లు భారీ స్కోరు చేసే అవకాశముంది. ఆ జట్టు ప్లేయర్లు నిలదొక్కుకుంటే సెంచరీలు చేయడాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ఒక గుణపాఠం లాంటిదన్నది విశ్లేషకుల అభిప్రాయంగా వినిపిస్తుంది. స్పిన్నర్లు, సీమర్లు పొదుపుగానే బౌలింగ్ చేయగలిగానా చెత్త ఫీల్డింగ్ తో బంగ్లాదేశ్ బతికి బట్టకలిగింది. ఒక దశలో ఓవర్ కు మూడు కూడా లేని రన్ రేటును 4.38కి పెంచడంలో మనోళ్లు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇప్పటికి షమి మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు, హర్షిత్ రాణా ఒక వికెట్ తీశారు. మరి యాభై ఓవర్లకు బంగ్లా జట్టు ఎన్నిపరుగులు చేస్తుందో? విజయలక్ష్యం భారత్ ముందు ఎంత ఉంటుందన్నది చూడాలి. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 212 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. ఇంకా ఐదు ఓవర్లు ఆడాల్సి ఉంది.
Next Story