Mon Dec 23 2024 05:34:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేక్ఫాస్ట్ అదిరిపోయిందిగా.. రుచికరమైన డిషెస్ అందించిన హోటల్ యాజమాన్యం
ఉదయం వెస్టిండీస్ నుంచి ఢిల్లీకి టీం ఇండియా జట్టు చేరుకుంది. విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లింది
ఉదయం వెస్టిండీస్ నుంచి ఢిల్లీకి టీం ఇండియా జట్టు చేరుకుంది. విమానాశ్రయం నుంచి నేరుగా ఐటీసీ మౌర్య హోటల్ కు వెళ్లింది. టీం ఇండియా క్రికెటర్లు తమ హోటల్ కు వస్తున్నారని తెలిసి బ్రేక్ ఫాస్ట్ కోసం ప్రత్యేకంగా వారికిష్టమైన డిషెస్ ను తయారు చేసింది. నోరూరించే రుచులతో బ్రేక్ ఫాస్ట్ ను టీం ఇండియా సభ్యులు అందుకున్నారని హోటల్ సిబ్బంది చెబుతున్నారు. హోటల్ కు చేరుకున్న టీం ఇండియాకు సిబ్బందిఘన స్వాగతం పలికారు.
ఇష్టమైన రుచులతో...
కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమైన ముంబయిలో ప్రసిద్ధి చెందిన వడా పావ్ ను సభ్యులకు వడ్డించారు. అలాగే విరాట్ కోహ్లి కూడా అమృత్ సర్ స్టయిల్ చోలే బటూరేని అందించారు. దీంతో పాటు సీజనల్ పండ్లను అందుబాటులో ఉంచారు. టీం ఇండియాకు ఇష్టమైన చాక్లెట్లను కూడా అందించారు. తర్వాత ప్రధాని నివాసానికి బయలుదేరే ముందు వారి చేత హోటల్ సిబ్బంది స్పెషల్ కేక్ ను కట్ చేయించారు.
Next Story