Mon Dec 23 2024 02:29:42 GMT+0000 (Coordinated Universal Time)
ప్రపంచ కప్ కు భారత జట్టు ప్రకటన.. వారికి బ్యాడ్ న్యూస్
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టును నేడు ప్రకటించారు
ఐసీసీ వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత క్రికెట్ జట్టును నేడు ప్రకటించారు. శనివారం అర్థరాత్రి, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా సీనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ 15 మంది ఆటగాళ్ల జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాను నేడు ప్రకటించారు. సూర్యకుమార్ యాదవ్ వన్డేలలో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగాడు. KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్ గాయాల నుండి కోలుకున్న తర్వాత జట్టులోకి వచ్చారు. ఇటీవల మిడిల్ ఆర్డర్ కోసం సూర్యకుమార్, కొత్త ఆటగాడు తిలక్ వర్మ, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్ లను తీసుకున్నారు. అయితే ప్రపంచ కప్ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్ లను పక్కన పెట్టారు. T20Iలలో ప్రపంచ నం.1 బ్యాట్స్‌మెన్ అయిన సూర్యకుమార్ యాదవ్.. వన్డేలలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు.
ఆసియా కప్ యొక్క గ్రూప్ దశ మ్యాచ్ ల కోసం కెఎల్ రాహుల్ శ్రీలంకకు వెళ్లనప్పటికీ ఇంకా మ్యాచ్ లు ఆడలేదు. ప్రపంచ కప్ లో కూడా రాహుల్ ను కొనసాగించింది జట్టు యాజమాన్యం. 31 ఏళ్ల రాహుల్ NCAలో బ్యాటింగ్, కీపింగ్ చేస్తూ తన ఫిట్నెస్ను నిరూపించుకోగలిగాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లిన గ్రూప్‌లో తిలక్, శాంసన్, ప్రసిద్ధ్ కృష్ణ లు వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయారు. ప్రసిద్ధ్, జస్ప్రీత్ బుమ్రా ఇటీవలే గాయాల నుండి తిరిగి జట్టులోకి వచ్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ జట్టులో ఉన్నారు. ఆసియా కప్‌కు దూరంగా ఉన్న యుజ్వేంద్ర చాహల్ ను ప్రపంచ కప్ కోసం కూడా పక్కన పెట్టేశారు. కుల్దీప్ యాదవ్ జట్టులో ఏకైక మణికట్టు స్పిన్నర్‌గా ఎంపికయ్యాడు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మరో ఇద్దరు స్పిన్ ఆప్షన్లు. ఇక ఇషాన్ కిషన్ జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా తన స్థానాన్ని నిలుపుకున్నాడు.
జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (కీపర్), ఇషాన్ కిషన్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (విసి), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా
Next Story