Mon Dec 23 2024 02:54:27 GMT+0000 (Coordinated Universal Time)
విజయానికి 8 వికెట్ల దూరంలో భారత్
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. దూకుడుగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్ చేసింది భారత్. దీంతో విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనలో విండీస్ జట్టు నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 76/2 స్కోరుతో నిలిచింది. త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (24), జర్మన్ బ్లాక్‌వుడ్ (20) క్రీజులో ఉన్నారు. చివరి రోజు విండీస్ విజయానికి ఇంకా 289 పరుగులు అవసరం కాగా.. టీమిండియాకు 8 వికెట్లు అవసరం. భారత్ ఈ మ్యాచ్ లో గెలిచి టెస్ట్ సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటూ ఉంది.
ఓవర్‌నైట్ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన విండీస్ 26 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/60) రాణించాడు. చివరి నాలుగు వికెట్లు అతడే తీయడం విశేషం. రెండో ఇన్నింగ్స్‌ను భారత్ ధాటిగా ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (57; 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (38; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడారు. రోహిత్, జైస్వాల్ వెంటవెంటనే ఔట్ అయినా.. ఇషాన్ కిషన్ (52; 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. శుభ్‌మన్ గిల్ (29; 37 బంతుల్లో 1 ఫోర్) మంచి సహకారం అందించాడు. ఇషాన్ అర్ధ సెంచరీ చేయగానే భారత్ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 438 పరుగులకు ఆలౌట్ అయింది.
Next Story