Mon Dec 23 2024 12:44:56 GMT+0000 (Coordinated Universal Time)
వైట్ వాష్ చేసే దిశగా టీం ఇండియా
రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీం ఇండియా వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది. కుర్రాళ్లతో జట్టు యమ ఫాంలో ఉంది.
రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీం ఇండియా వరుస విజయాలను సొంతం చేసుకుంటుంది. కుర్రాళ్లతో జట్టు యమ ఫాంలో ఉంది. జట్టులో ప్రయోగాలు చేసినా ఫలితం చివరకు ఇండియాదే అవుతుంది. శ్రీలంకతో జరిగిన రెండో టీ 20ని కూడా ఇండియా గెలుచుకుని సిరీస్ ను తన ఖాతాలో వేసుకుంది. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలకం 183 పరుగులు చేసింది. టీ 20లో ఇది భారీ స్కోర్ గానే చెప్పాలి. 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం తప్ప ఎక్కడా తడబాటు కన్పించలేదు.
మళ్లీ ధర్మశాలలోనే....
భారత్ జట్టులో శ్రేయస్ అయ్యర్ 74 పరుగులు, జడేజా 45, సంజూ శాంసన్ 39 పరుగులు చేసి భారత్ జట్టును విజయపథాన నిలిపారు. శ్రేయస్ అయ్యర్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వరస విజయాలతో ఉన్న టీం ఇండియా ఆదివారం మూడో టీ 20 ని ఆడనుంది. ధర్మశాలలోనే ఈ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి వైట్ వాష్ చేయాలని టీం ఇండియా చూస్తుంది.
Next Story