Mon Dec 23 2024 18:05:50 GMT+0000 (Coordinated Universal Time)
నేటి మ్యాచ్ కీలకం... ఇది గెలిస్తేనే?
మహిళ ప్రపంచ కప్ లో టీం ఇండియా వరసగా రెండు మ్యాచ్ లను గెలవాల్సి ఉంటుంది.
మహిళ ప్రపంచ కప్ లో టీం ఇండియా వరసగా రెండు మ్యాచ్ లను గెలవాల్సి ఉంటుంది. నేడు బంగ్లాదేశ్ తో గెలిచే మ్యాచ్ లో గెలిచి, ఈ నెల 27వ తేదీన జరిగే దక్షిణాఫ్రికా మ్యాచ్ లోనూ టీం ఇండియా విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే టీం ఇండియా సెమీస్ కు చేరుకుంటుంది. ఈ రెండింటిలో ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా ఇక ఇంటి దారి పట్టక తప్పదు. అందుకే ఈరోజు బంగ్లాదేశ్ తో టీం ఇండియా ఆడే మ్యాచ్ కీలకంగా మారనుంది.
మూడింటిలో ఓడి.....
మహిళల ప్రపంచ కప్ లో టీం ఇండియా ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడగా, కేవలం రెండు మ్యాచ్ లలో గెలిచి, మూడింటిలో ఓటమి పాలయింది. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్ల మీద మాత్రమే గెలిచింది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓటమి పాలయింది. దీంతో ఈ నేటి మ్యాచ్ లో టీం ఇండియా రాణిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా నిలుస్తాయి. బౌలర్లు విఫలమవుతుండటంతోనే టీం ఇండియా పేలవ ప్రదర్శన చేస్తుంది.
Next Story