Sun Apr 13 2025 23:23:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రెండో టీ 20.... విజయావకాశాలు?
టీం ఇండియా నేడు శ్రీలంకతో రెండో టీ 20 ఆడనుంది. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది.

ధర్మశాల : టీం ఇండియా నేడు శ్రీలంకతో రెండో టీ 20 ఆడనుంది. ధర్మశాలలో జరగనున్న ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదో తేల్చనుంది. ఇప్పటికే తొలి టీ 20ను కైవసం చేసుకున్న టీం ఇండియా ఈ మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను ముందుగానే గెలవాలన్న ఉద్దేశ్యంతో బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టిన తర్వాత వరస విజయాలతో ఊపు మీదున్న టీం ఇండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది.
శ్రీలంక జట్టు....
రోహిత్ శర్మ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను ఓపెనర్ గా పంపాలని యోచిస్తున్నారు. రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్ లో వచ్చే అవకాశముంది. జట్టులో మరికొన్ని మార్పులు కూడా ఉంటాయని చెబుతున్నారు. ఇక శ్రీలంక జట్టు కూడా పటిష్టంగానే ఉంది. తొలి వన్డేలో ఓటమి నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ మ్యాచ్ లోకి బరిలోకి దిగుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచి కసి తీర్చుకోవాలన్న ఆలోచనతో ఉంది. ధర్మశాలలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story