Mon Dec 23 2024 16:21:02 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దక్షిణాఫ్రికాతో ఇండియా మూడో టీ 20
టీం ఇండియా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ 20 మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ కప్ కు ముందు ఆడే ఆఖరి టీ 20 మ్యాచ్ ఇదే
టీం ఇండియా నేడు దక్షిణాఫ్రికాతో మూడో టీ 20 మ్యాచ్ ఆడుతుంది. ప్రపంచ కప్ కు ముందు ఆడే ఆఖరి టీ 20 మ్యాచ్ ఇదే. ఇప్పటికే సొంత గడ్డపై తొలిసారి దక్షిణాఫ్రికాపై సిరీస్ ను చేజిక్కించుకున్న రోహిత్ సేన ఈ మ్యాచ్ లో ప్రయోగాలను చేయడానికి సిద్ధమయింది. ముఖ్యమైన ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించింది. దక్షిణాఫ్రికతో జరిగిన రెండు టీ 20 మ్యాచ్ లలో భారత్ ఇప్పటికే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇండోర్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కొన్ని మార్పులతో...
ఈ మ్యాచ్ లో విరాట్ కొహ్లికి విశ్రాంతి ఇవ్వనున్నారు. కొహ్లి స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు ఆడే అవకాశం దక్కనుంది. ఈ మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ కు అవకాశం కల్పించనున్నారు. ఇక దక్షిణాఫ్రికా కూడా పరువు నిలుపుకునే ప్రయత్నంలో ఉంది. మూడో టీ 20లోనైనా గెలిచి తమ సత్తా చాటాలని చూస్తుంది. ఆ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా దిగే అవకాశాలయితే ఇప్పటి వరకూ కనిపిస్తున్నాయి. గెలుపు ఎవరిదైనా సిరీస్ ఇప్పటికే సొంతం కావడంతో భారత్ బిందాస్ గా ఆడొచ్చు.
Next Story