Mon Dec 23 2024 13:16:15 GMT+0000 (Coordinated Universal Time)
కింగ్ ఈజ్ బ్యాక్
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. 67 పరుగుల తేడాతో విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. విరాట్ కొహ్లి, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ చెలరేగి ఆడటంతో ఇండియా భారీ స్కోరు చేసింది. విరాట్ కొహ్లి తిరిగి ఫామ్ లోకి రావడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కొహ్లి 87 బంతుల్లో 113 పరుగులు చేసి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. భఆరత్ 373 భారీ పరుగులు సాధించడంతో శ్రీలంక జట్టుకు కొంత కఠినంగా క్రీజులోకి దిగింది.
బౌలర్లు....
అనుకున్నట్లుగానే సిరాజ్, ఉమ్రాన్ లు ఇద్దరూ బౌలింగ్ లో సత్తా చూపడంతో శ్రీలంక వికెట్లు టపా టపా కూలిపోయాయి. దీంతో శ్రీలంక కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ షనక మాత్రం చివర వరకూ పోరాడాడు. షనక కూడా సెంచరీ పూర్తి చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే శ్రీలంక ఓటమి ఖాయమయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ కొహ్లి సొంతం చేసుకున్నాడు. విరాట్ తిరిగి ఫామ్ లోకి రావడంతో భారత్ క్రికెట్ అభిమానులు స్టేడియంలో కేరింతలు కొట్టారు.
Next Story