Mon Dec 23 2024 07:55:27 GMT+0000 (Coordinated Universal Time)
పంజాబ్ కింగ్స్ తరఫున ఆడినా.. నా ఫేవరెట్ మాత్రం సీఎస్ కే నే : దీపక్ హుడా
ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలం గురించి నేను ఆలోచించ
త్వరలో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఈసారి భారత్ లోనే ఐపీఎల్ నిర్వహించనుుండటంతో క్రికెట్ అభిమానులు.. ఈ సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం నిర్వహించనున్నారు. అంతకన్నా ముందు.. ఫిబ్రవరి 6వ తేదీన వెస్టిండీస్ తో వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా క్రికెటర్ దీపక్ హుడా తన మనసులో మాటను బయటపెట్టాడు. మొన్నటి వరకూ ఐపీఎల్ సీజన్లలో తాను పంజాబ్ కింగ్స్ జట్టు తరపున ఆడినా.. వ్యక్తిగతంగా మాత్రం తన ఫేవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అని తెలిపాడు దీపక్ హుడా.
Also Read : మేజర్ కు రూట్ క్లియర్.. రిలీజ్ డేట్ ఫిక్స్ !
"చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీకి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా చాలా సార్లు మహీతో మాట్లాడాను. ధోనీ సారథ్యంలో ఒక్క మ్యాచ్ అయినా ఆడాలని ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరుగనున్న ఐపీఎల్ మెగా వేలం గురించి నేను ఆలోచించడం లేదు. ప్రస్తుతం నా దృష్టంతా ఫిబ్రవరి 6న ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్ గురించే" అని దీపక్ చెప్పుకొచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న వన్డే, టీ20 సిరీస్ కోసం ఇటీవల బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో దీపక్ హుడాకు చోటు దక్కిన విషయం తెలిసిందే. ముగ్గురు స్టార్ ప్లేయర్స్ కరోనా బారిన పడడంతో హుడాకు తుది జట్టులో కూడా చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఇండియా న్యూస్ లో జరిగిన చర్చలో దీపక్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఐపీఎల్ 2022 కోసం పంజాబ్ టీమ్ అయాంక్ అగర్వాల్, అర్ష్‌దీప్ సింగ్‌లను మాత్రమే అట్టిపెట్టుకుంది. దాంతో దీపక్ వేలంలోకి వచ్చాడు. 12,13 తేదీల్లో జరిగే మెగా వేలంలో దీపక్ ఏ జట్టు తరపున ఆడనున్నాడో తేలనుంది.
News Summary - Team India Young Cricketer Deepak Hooda Wants to play for CSK under MS Dhoni Captaincy
Next Story