Tue Dec 24 2024 02:48:35 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తేలనున్న టీం ఇండియా సెమీస్ ఆశలు
మహిళల వరల్డ్ కప్ టోర్నీలో నేడు టీం ఇండియా భవితవ్యం తేలనుంది. నేడు దక్షిణాఫ్రికాతో మిథాలి సేన తలపడనుంది.
మహిళల వరల్డ్ కప్ టోర్నీలో నేడు టీం ఇండియా భవితవ్యం తేలనుంది. నేడు దక్షిణాఫ్రికాతో మిథాలి సేన తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. ఓటమి పాలయితే ఇంటి దార పట్టక తప్పదు. మహిళల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ కు చేరుకున్నాయి. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఇండియా సెమీస్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియా సెమీస్ లో చేరేాలంటే ఈరోజు దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ లో గెలవాల్సి ఉంటుంది.
ఎలాగైనా...?
ఇప్పటి వరకూ టీం ఇండియా ఆరు పాయింట్లను సాధించింది. ఈ మ్యాచ్ గెలిస్తే ఎనిమిది పాయింట్లతో నేరుగా సెమీస్ చేరుకునే వీలుంది. మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయినా టీం ఇండియాకు అడ్వాంటేజీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఒక పాయింట్ తో భారత్ ఏడుకు చేరుకుని వెస్టిండీస్ తో సమానంగా ఉంటుంది. అయితే రన్ రేట్ ప్రకారం సెమిస్ కు భారత్ చేరుకునే అవకాశాలే ఎక్కువ. ఈరోజు జరిగే మ్యాచ్ తో ఇండియా సెమీస్ లో ఉంటుందా? లేదా? అన్నది తేలనుంది.
Next Story