టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు కోవిడ్ పాజిటివ్
అక్కడి నుంచి తిరిగొచ్చాకే కరోనా బారిన పడినట్లు నాదల్ ట్వీట్ లో పేర్కొన్నాడు. తనకు స్వల్ప కోవిడ్
టెన్నిస్ స్టార్, స్పెయిన్ కు చెందిన రఫెల్ నాదల్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని నాదలే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. ఇటీవల నాదల్ అబుదాబిలో ఓ టోర్నమెంట్ ఆడాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాకే కరోనా బారిన పడినట్లు నాదల్ ట్వీట్ లో పేర్కొన్నాడు. తనకు స్వల్ప కోవిడ్ లక్షణాలున్నప్పటికీ.. రోజురోజుకూ తాను కరోనా నుంచి కోలుకుని మామూలుగా అవుతానన్న నమ్మకం తనకుందన్నాడు. ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే ఉండి, చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారందరికీ కూడా కరోనా సోకినట్లు నాదల్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్ లో తాను ఏయే టోర్నమెంట్స్ లో పాల్గొనేది.. ఎప్పటికప్పుడు చెప్తుంటానన్నాడు.
కాగా.. నాదల్ పాదానికి గాయం కావడంతో చాలా రోజులుగా ఆటకు దూరమయ్యాడు. ఆ గాయానికి సర్జరీ చేయాల్సి వచ్చింది. కొత్త సంవత్సరంలో జరగనున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ కు నాదల్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న సమయంలో.. కరోనా నిర్థారణ అయింది. దీంతో.. కొత్త ఏడాదిలో నాదల్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొంటాడా ? లేదా ? అన్న సందిగ్ధంలో ఉన్నారు అతని అభిమానులు. జనవరి 17, 2022 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.