Sun Dec 22 2024 11:02:59 GMT+0000 (Coordinated Universal Time)
మెన్స్ క్రికెట్ లో భారత్ కు గోల్డ్.. ఎలా వచ్చిందంటే?
ఆసియా గేమ్స్ లో ఇండియా మెన్స్ క్రికెట్ జట్టుకు గోల్డ్ మెడల్
ఆసియా గేమ్స్ లో ఇండియా మెన్స్ క్రికెట్ జట్టుకు గోల్డ్ మెడల్ లభించింది. ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆఫ్ఘనిస్థాన్ తో తలపడింది. ఫైనల్ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో భారత జట్టు ర్యాంకింగ్ ఆధారంగా గోల్డ్ మెడల్ లభించింది. ఆఫ్ఘానిస్తాన్ జట్టుకు సిల్వర్ మెడల్ లభించింది.
ఫైనల్ మ్యాచ్ అనుకున్న సమయానికంటే ముందే కాస్త ఆలస్యంగా మొదలైంది. ఇక మ్యాచ్ మొదలయ్యాక వర్షం అడ్డుపడుతూనే వచ్చింది. 18.2 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది. ఎంత సేపటికీ వర్షం తగ్గలేదు. కనీసం 5 ఓవర్ల పాటూ భారత్ కు ఛేజింగ్ చేసే అవకాశాన్ని ఇస్తారని అందరూ ఎదురుచూశారు. అయితే వర్షం పడుతూనే ఉండడంతో మ్యాచ్ కొనసాగించడం సాధ్యం కాదని తెలిపారు. దీంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఆఫ్ఘనిస్తాన్ కంటే భారత్ ముందే ఉండడంతో గోల్డ్ మెడల్ భారత్ కు ఇస్తున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్ కు బ్రాంజ్ మెడల్ దక్కింది.
Next Story