Fri Nov 22 2024 07:09:52 GMT+0000 (Coordinated Universal Time)
India vs Australia T2o : మ్యాచ్ కు వర్షం అడ్డంకి కాబోతుందా? వెదర్ రిపోర్టు ఇదే
భారత్ - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది
భారత్ - ఆస్ట్రేలియా టీ 20 మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉంది. వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్ వర్షం రాకూడదని కోరుకుంటున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన కారణంగా వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు అభిమానుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. మ్యాచ్ జరగడంపై అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
అభిమానుల్లో ఆందోళన...
ఇప్పటికే మ్యాచ్ కు సంబంధించి టిక్కెట్లను ఫ్యాన్స్ కొనుగోలు చేశారు. విశాఖలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలని భావించారు. కానీ మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా నిలిచిపోతుందేమోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమయానికి వర్షం పడుతుందన్న సూచనలు అందడంతో టాస్ ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. దీంతో వర్షం పడితే మ్యాచ్ నిలచిపోతే మనకు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని మిస్ అవుతామోనన్న బెంగ అభిమానుల్లో ఉంది.
Next Story