Mon Dec 23 2024 14:29:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మూడు వన్డే.. ఎవరిది?
ఇండియా - వెస్టిండీస్ మూడో వన్డే నేడు జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ మీద కన్నేసింది
ఇండియా - వెస్టిండీస్ మూడో వన్డే నేడు జరగనుంది. ఇప్పటికే సిరీస్ ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్ స్వీప్ మీద కన్నేసింది. మూడు వన్డే మ్యాచ్ లలో ఒక్కటైనా గెలవాలని వెస్టిండీస్ కసిగా ఉంది. చివరి మూడో వన్డే నేడు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో జరగనుంది. గత రెండు వన్డేల్లో 300కు పైగా ఇరు జట్లు స్కోర్ చేశాయి. అయినా విజయం మాత్రం భారత్ నే వరించింది. భారత్ ప్రస్తుతం 2 - 0తో ఆధిక్యంలో ఉంది. సిరీస్ గెలిచినా పరాయి గడ్డపై క్లీన్ స్పీవ్ చేయాలన్న లక్ష్యంతో భారత్ ఆటగాళ్లు ఉన్నారు. అదే సమయంలో ఒక్క మ్యాచ్ లోనైనా గెలిచి సొంత గడ్డలో పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్ భావిస్తుంది.
సిరీస్ గెలవడంతో....
సిరీస్ గెలవడంతో భారత్ కొద్ది మార్పులతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ఆవేశ్ ఖాన్ స్థానంలో అర్ష్ దీప్ సింగ్ ను తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కు అవకాశం కల్పించే వీలుంది. చాహల్ స్థానంలో మరొకరికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. వెస్టిండీస్ జట్టు మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. మూడో వన్డే ఎవరి పరం అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story