Fri Nov 22 2024 11:34:00 GMT+0000 (Coordinated Universal Time)
India Vs Australia T20 : మూడోది మనదే అయితే ఎంత మజా?
భారత్ - ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది.
భారత్ - ఆస్ట్రేలియా మూడో టీ 20 మ్యాచ్ నేడు జరగనుంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన ఊపు మీదున్న టీం ఇండియా మూడో మ్యాచ్ ను కూడా గెలిచి సిరీస్ ను ముందుగానే తమ ఖాతా వేసుకోవాలని భావిస్తుంది. ఆస్ట్రేలియా మాత్రం కసితో రగిలిపోతుంది. వరల్డ్ కప్ లో గెలిచిన చోటనే టీ 20 సిరీస్ ను కూడా గెలుచుకుని విశ్వవిజేతలని చాటుదామని అనుకుంటోంది. ఆస్ట్రేలియా సిరీస్ గెలవాలంటే రానున్న మూడు మ్యాచ్ లు వరసగా గెలవాలి. భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది.
ఛేదనలో.. కట్టడిలోనూ...
విశాఖలో తొలి వన్డేలో ఛేదనలో 209 పరుగులు చేసి విజయం దక్కించుకుంది. ఇక రెండో మ్యాచ్ లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు భారీ స్కోరు చేసి ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయగలిగింది. ఇటు ఛేదనలోనూ, అటు బౌలింగ్ ద్వారా కట్టడి చేయడంలోనూ యంగ్ ఇండియా పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అందుకే అంతటి భారీ విజయం దక్కింది. రెండో టీ 20లో ఆస్ట్రేలియాపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడో మ్యాచ్ కూడా గెలవాలని భారత్ తహతహలాడుతుంది.
కసితో కంగారూలు...
ఆస్ట్రేలియా మాత్రం కసితో రగలిపోతుంది. తొలి మ్యాచ్ లో భారీ స్కోరు చేసినా బౌలింగ్ పరంగా కట్టడి చేయలేకపోయింది. తిరువనంతపురంలో జరిగిన రెండో మ్యాచ్ లోనూ బ్యాటర్లు విఫలమయ్యారు. ఇప్పుడు అన్ని విభాగాల్లో సత్తా చాటి గెలుపును సొంతం చేసుకోవాలని కంగారూలు భావిస్తున్నారు. కసిగా ఉన్న కంగారూలను కట్టడి చేయడం భారత్ వంతయితే.. భారత్ ను ఈ మ్యాచ్ లో ఎలా నిలువరించాలన్నది టీం ఇండియా వ్యూహంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్ సిరీస్ ఎవరిదన్న దానిపై ఒక స్పష్టత తేనుంది.
Next Story