Mon Mar 31 2025 03:25:01 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England 3rd T20 : హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోండి బాసూ.. సిరీస్ మనదే
భారత్ - ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. రాజ్ కోట్ వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం నుంది

భారత్ - ఇంగ్లండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ నేడు జరగనుంది. రాజ్ కోట్ వేదికగా రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభం నుంది. రాజ్ కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే టీ 20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకున్నట్లే అవుతుంది. ఇప్పటికే కోల్ కత్తా, చెన్నైలో జరిగిన మ్యాచ్ లో భారత్ అద్భుతమైన పెర్ ఫార్మెన్స్ చూపించింది. బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో వరసగా రెండు విజయాలను అందుకుంది. మొదటి మ్యాచ్ లో అభిషేక్ శర్మ చెలరేగి ఆడగా, రెండో మ్యాచ్ లో చెన్నైలో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన మ్యాచ్ ను గెలిపించి శభాష్ అనిపించుకున్నాడు. అందరి దృష్టిలో పడ్డాడు.
రెండు గెలిచి...
కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఏడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించగా, చెన్నైలో రెండు వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. మొత్తం ఐదు టీ20 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఇది మూడోది కావడంతో భారత్ గెలిచి సిరీస్ ను గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుంది. సొంత మైదానాలు కావడంతో పాటు అనుకూలమైన వాతావరణంతో పాటు భారత్ కు బలమైన బ్యాటింగ్ లైనప్, బౌలర్లు కూడా ఉండటం కలసి వచ్చే అంశంగా చూడాలి. బౌలర్లలో అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్థిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లు వికెట్లు ఎప్పటికప్పుడు తీస్తూ భారత్ కు బలంగా ఉన్నారు. మరోవైపు బ్యాటింగ్ లో అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, తిలక్ వర్మ, రింకూసింగ్ వంటి వారు కూడా దుమ్ములేపుతున్నారు.
ఈ మ్యాచ్ గెలవాలని...
మూడో మ్యాచ్ లో గెలవాలని ఇంగ్లండ్ గట్టిగా భావిస్తుంది. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా రాజ్ కోట్ లోనూ దిగేందుకు ఇంగ్లండ్ సిద్ధమయింది. బ్యాటర్లు విఫలమయినా వారినే మూడో టీ20 లో కూడా కొనసాగించాలని నిర్ణయించింది. అంటే భారత్ పై మూడో టీ20లో ఇదే జట్టుతో గెలవాలని ఎంత కసితో ఉందో అర్థమవుతుందిగా. ఇక భారత్ జట్టు స్వల్ప మార్పులతో ఈ మ్యాచ్ లో దిగే అవకాశముంది. అయితే మూడో మ్యాచ్ కీలకం కావడంతో రెండు జట్లు హోరా హోరీ పోరాడే అవకాశముంది. ఇరుజట్లు ఉత్కంఠ భరితంగా నేటి మ్యాచ్ ను ముగించే ఛాన్స్ ఉందని క్రీడా నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండు జట్లు గెలుపు కోసం శ్రమిస్తుండటంతో గెలుపు ఎవరన్నది చివరి బాల్ వరకూ ఉత్కంఠ తప్పేలా కనిపించడం లేదు.
Next Story