Mon Dec 23 2024 02:17:32 GMT+0000 (Coordinated Universal Time)
India Vs England : అదే జరిగితే మూడో టెస్ట్ మనదే
రాజ్కోట్ లో జరుగుతున్న భారత్ - ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది
రాజ్కోట్ లో జరుగుతున్న భారత్ - ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే ఒకరకంగా చూస్తే భారత్ పట్టు బిగిసిసినట్లే కనపడుతుంది. అయితే ప్రత్యర్ధి ఇంగ్లండ్ కావడంతో అలా ఆలోచించడానికి వీలులేదు. మైదానంలో ఏదైనా జరగొచ్చు. ప్రస్తుతానికి మాత్రం భారత్ ఇంగ్లండ్ కంటే భారత్ భారీ స్కోరు ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం ఇంగ్లండ్ కంటే 322 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది.
సమిష్టిగా రాణిస్తే....
మన బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. సిరాజ్ నాలుగు వికెట్లు తీసి విజయాన్ని కొంత భారత్ వైపునకు తిప్పారు. అయితే రెండో ఇన్నింగ్స్ లో మన బౌలర్లు ఇంగ్లండ్ ను ఏమాత్రం కట్టడి చేస్తారన్నది చూడాల్సి ఉంది. మొదటి ఇన్నింగ్స్ లో మాదిరిగా బౌలర్లను కట్టడి చేయగలిగేతే విజయం మనదే. మరోవైపు అశ్విన్ లేకుండా బరిలోకి దిగడంతో మన బౌలర్లు ఏ మాత్రం రెండో ఇన్నింగ్స్ లో రాణిస్తారన్నది చూడాల్సి ఉంది. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్ కావడంతో ఏదైనా జరగొచ్చు. అందుకే ముందుగా అంచనాలు వేయలేకపోయినా ప్రస్తుతానికి మాత్రం భారత్ వైపు విక్టరీ తొంగి చూస్తుందని మాత్రం చెప్పొచ్చు.
Next Story