Fri Jan 10 2025 15:29:30 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో నేడు క్రికెట్ టిక్కెట్ల విక్రయం
విశాఖపట్నంలో ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్ కోసం టిక్కెట్లు నేటి నుంచి విక్రయిస్తున్నారు
విశాఖపట్నంలో ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్ కోసం టిక్కెట్లు నేటి నుంచి విక్రయిస్తున్నారు. ఆఫ్ లైన్ టిక్కెట్ల విక్రయాన్ని నేటి నుంచి జరపనున్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఆన్ లైన్ టిక్కెట్లను విక్రయించారు. టిక్కెట్లు ఆన్లైన్ లో పెట్టిన అరగంటకే అమ్ముడుపోవడంతో అనేక మంది క్రికెట్ ఫ్యాన్స్ కు నిరాశ ఎదురయింది. పేటీఎం యాప్, పేటీఎం ఇన్సైడర్ యాప్, ఇన్ వెబ్ ల నుంచి టిక్కెట్లను కొనుగోలు చేశారు.
ఆస్ట్రేలియా - భారత్ వన్డే మ్యాచ్...
నేటి నుంచి ఆఫ్ లైన్ కోసం టిక్కెట్లను విక్రయించనున్నారు. ఉదయం పది గంటలకు టిక్కెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ఈ సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఈ నెల 19న విశాఖలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య డే అండ్ నైట్ వన్డే మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎగబడే అవకాశముండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.
Next Story