Mon Dec 23 2024 07:53:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఇండియా - విండీస్ థర్డ్ టీ 20
నేడు భారత్ మూడో టీ 20లో వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది
నేడు భారత్ మూడో టీ 20లో వెస్టిండీస్ తో తలపడనుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది. ఐదు మ్యాచ్ లున్న ఈ సిరీస్ లో ఇప్పటికే భారత్ రెండు మ్యాచ్ లలో గెలవగా, వెస్టిండీస్ ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. మూడో మ్యాచ్ లో రిటైర్డ్ హర్ట్ గా తొలగిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. ఈరోజు జరిగే మ్యాచ్ లో రోహిత్ పాల్గొననున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను సొంతం చేసుకున్నట్లే అవుతుంది.
బలంగా వెస్టిండీస్...
అయితే వెస్టిండీస్ కూడా బలంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా బలంగా ఉండటంతో ఈ మ్యాచ్ గెలవాలని ఆ జట్టు కసరత్తులు చేస్తుంది. ఈ మ్యాచ్ వెస్టిండీస్ గెలిస్తే రెండు జట్ల స్కోరు సమమవుతుంది. రేపు జరిగే మ్యాచ్ లో సిరీస్ ఎవరది అన్నది తేలుతుంది. ఈ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ ను భారత్ దూరం పెట్టే అవకాశముందని తెలుస్తోంది. వరసగా విఫలమవుతున్నందున అయ్యర్ ను ఈ మ్యాచ్ ఆడించకపోవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Next Story