Mon Dec 23 2024 00:35:20 GMT+0000 (Coordinated Universal Time)
నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్
ఆసియా కప్ లో నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ జరగనుంది.
ఆసియా కప్ లో నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ కు ఇండియా చేరాలంటే శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. అందుకే నేడు శ్రీలంకతో భారత్ మ్యాచ్ కీలకంగా మారనుంది. గత ఆదివారం పాక్ పై ఓటమి తర్వాత కొంత మార్పులు, చేర్పులు చేసే అవకాశం కన్పిస్తుంది. వరసగా రెండు మ్యాచ్ లు గెలిస్తేనే ఇండియా ఫైనల్ కు చేరుకుంటుంది. అందుకే ఇండియాకు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.
బలంగా కనిపిస్తున్నా....
బ్యాటింగ్ లో బలంగా కన్పిస్తున్న భారత్, బౌలింగ్ పరంగా కొన్ని మార్పులు చేయాల్సి ఉందంటున్నారు క్రీడా నిపుణులు. బౌలింగ్ పరంగా బలహీనంగా ఉందంటున్నారు. మరో వైపు శ్రీలంక కూడా బలంగా ఉంది. ఆప్ఘనిస్తాన్ పై శ్రీలంక విజయాన్ని చూసిన వారికి ఎవరికైనా ఈ విషయం స్పష్టం అవుతుంది. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు ఫైనల్ కు చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే ఇరు జట్లు విజయం కోసం శ్రమించనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story