Sat Dec 21 2024 10:19:21 GMT+0000 (Coordinated Universal Time)
తండ్రైన టీమిండియా క్రికెటర్.. మహాలక్ష్మి పుట్టిందంటూ పోస్ట్
తన ఆనందానికి అక్షరరూపమిచ్చి.. ఇట్స్ ఏ బేబీ గర్ల్’.. మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మి అడుగుపెట్టింది.
టీమిండియా క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ మరోసారి తండ్రయ్యాడు. అతని భార్య తాన్య వధ్వా రెండవ కాన్పులో మార్చి 8న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉమేశ్ యాదవ్ తన ఇన్ స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన ఆనందానికి అక్షరరూపమిచ్చి.. ఇట్స్ ఏ బేబీ గర్ల్’.. మహిళా దినోత్సవం రోజే మహాలక్ష్మి అడుగుపెట్టింది. మరోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందినందుకు ఆనందంగా, గర్వంగా ఉంది అని రాశాడు. దాంతో ఉమేష్ దంపతులకు పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
భారత జట్టుకు ఫాస్ట్ బౌలర్గా సేవలందిస్తోన్న ఉమేశ్ 2013 మే 29న పంజాబ్కు చెందిన తాన్యాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2021 జనవరి 1న కూతురు జన్మించింది. రెండోసారి కూడా తాన్య పాపకు జన్మనివ్వడంతో.. వారి కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతోంది. ఇటీవలే ఉమేశ్ కు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. ఇక మార్చి 9 నుంచి భారత్ - ఆస్ట్రేలియా ల మధ్య ఆఖరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.
Next Story