Mon Dec 23 2024 16:33:11 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా క్రికెట్ బోర్డులో తెలుగోడు
USA క్రికెట్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డాక్టర్ నూర్ మొహమ్మద్, బోర్డు పూర్తికాల ఛైర్మన్‌గా వేణు పిసికే ను
అమెరికాలో క్రికెట్ కు ఇంకా గొప్ప ఆదరణ లభించడం లేదు. ఈ మధ్య కాలంలో క్రికెట్ లీగ్ లు మొదలవుతూ ఉండడంతో ప్రవాస భారతీయులు, ఇతర దేశాలకు చెందిన సెటిలర్లు క్రికెట్ మీద అంతో ఇంతో దృష్టి పెడుతూ ఉన్నారు. ఇక క్రికెట్ ను పాపులర్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
USA క్రికెట్ తన తదుపరి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా డాక్టర్ నూర్ మొహమ్మద్ మురాద్ ను, బోర్డు పూర్తికాల ఛైర్మన్‌గా వేణు పిసికే ను ఎన్నుకున్నారు. USA క్రికెట్ ఏప్రిల్ 2023లో వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. USA క్రికెట్‌కి తదుపరి CEO కోసం వర్కింగ్ గ్రూప్ దరఖాస్తుదారులను ఆహ్వానించింది. 6 మంది అభ్యర్థులతో కూడిన షార్ట్‌లిస్ట్ చేయగా.. అందులో 3 అభ్యర్థులకు ఇంటర్వ్యూ చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులపై సుదీర్ఘ చర్చల తర్వాత డాక్టర్ మురాద్‌ను ఎంపిక చేశారు.
డాక్టర్ మురాద్ 2012-2014 వరకు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ CEO గా పనిచేశారు, అసోసియేట్ క్రికెట్ స్థాయి నుండి 2015 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆఫ్ఘన్ స్థానం సాధించే వరకూ ముందుకు తీసుకుని వెళ్లారు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్లో అతని పదవీకాలంలో, ఆఫ్ఘనిస్తాన్ జట్టు ప్రతిష్టాత్మక లారెస్ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ అవార్డును అందుకుంది. అలాగే 2014లో ICC బెస్ట్ ఓవరాల్ క్రికెట్ డెవలప్మెంట్, బెస్ట్ జూనియర్ పార్టిసిపేషన్ ఇనిషియేటివ్ అవార్డులను సాధించింది. కాబూల్ విశ్వవిద్యాలయంలో డాక్టర్‌గా కూడా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పుడు అమెరికా క్రికెట్ లో కీలక బాధ్యతలను పోషిస్తూ ఉన్నాడు.
డైరెక్టర్ సీటును దక్కించుకున్న వ్యక్తి వేణు పిసికే తెలుగు వ్యక్తి కావడం విశేషం. వేణు పిసికే కు ఐటీ పరిశ్రమలో 20 ఏళ్లకు పైగా పని అనుభవం ఉంది. వేణు 1998లో ఫుజిట్సు కన్సల్టింగ్‌లో సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కెరీర్ ను మొదలుపెట్టాడు. 2004లో బెల్సౌత్కి లీడ్ సాఫ్ట్వేర్ డెవలపర్‌గా మారారు. 2006లో మిరాంట్ మరియు చిక్-ఫిల్-ఎ రెండింటిలోనూ అప్లికేషన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. పలు కంపెనీలలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ పాత్రలను నిర్వహించారు.
వేణు పిసికే 1987-1991 గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయిన వేణు క్రికెట్ మీద మక్కువతో అమెరికాలో కూడా క్రికెట్ ను పాపులర్ చేయాలని అనుకున్నారు. అట్లాంటా క్రికెట్ లీగ్ ను 2007 లో మొదలుపెట్టారు. 2014 లో అట్లాంటా క్రికెట్ అకాడెమీని కూడా స్థాపించారు వేణు.
2018లో 14 క్లబ్‌లతో కొత్త క్రికెట్ బాల్ లీగ్ ‘ACA క్రికెట్ లీగ్’ని ప్రారంభించింది. పరిమిత వనరులతో అమెరికా లో క్రికెట్ ను అభివృద్ధి చేయడంలో వేణుకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. వేణుకు సరికొత్త బాధ్యతలు దక్కడం ద్వారా USA క్రికెట్ బోర్డుకు మంచి జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు.
Next Story