Mon Dec 23 2024 07:25:38 GMT+0000 (Coordinated Universal Time)
స్టేడియంలో కుర్చీలకు కలర్ వేస్తున్న ధోనీ
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ థోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేశాడు
చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ థోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తూ ధోని కనిపించాడు. ఇది నెట్టింట వైరల్ గా మారడంతో ధోని స్పెషల్ అదేనంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ కోసం నగరంలోని చిదంబరం స్టేడియానికి వచ్చింది. ఐపీఎల్ ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో థోని టీం ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది.
మిస్టర్ కూల్...
ప్రాక్టీస్ కు చిదంబరం స్టేడియానికి వచ్చిన మిస్టర్ కూల్ స్టేడియంలోని కుర్చీలకు రంగులు వేస్తూ కనిపించాడు. దీంతో కొందరు ఈ ఫొటోలను, వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎంఎస్ ధోని సరదాగా ఈ పనిచేసినా స్టేడియం అధికారులు కుర్చీలకు రంగులు వేయాలని సూచించినట్లేనని నెటిజన్లు అంటున్నారు. మొత్తం మీద ధోని వీడియో మాత్రం క్రికెట్ అభిమానులతో పాటు ఆయన ఫ్యాన్స్ కు కూడా కూల్ మ్యాన్ సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.
Next Story