Sat Dec 21 2024 13:02:03 GMT+0000 (Coordinated Universal Time)
భార్యతో సెల్ఫీ దిగేందుకు అత్యుత్సాహం.. సహనం కోల్పోయిన కోహ్లీ
ఇటీవల అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ కు విచ్చేశారు. ఈ విషయం కాస్తా ఆ చుట్టుపక్కల..
సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్ లలో కనిపిస్తే ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు కూడా మనుషులేనన్న సంగతి మరచిపోయి ప్రవర్తిస్తారు అభిమానులు. సెల్ఫీల కోసం ఎగబడుతూ వాళ్లను ఇబ్బందికి గురిచేస్తుంటారు. ఇటీవల నయనతారకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. తాజాగా విరుష్క జంటకు కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఒక్కోసారి అభిమానుల మితిమీరిన చేష్టల కారణంగా సెలబ్రిటీలు సహనం కోల్పోతుంటారు.
ఇటీవల అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ కలిసి బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ కు విచ్చేశారు. ఈ విషయం కాస్తా ఆ చుట్టుపక్కల ఉన్నవారికి తెలియడంతో.. వారితో సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. భోజనం ముగించుకున్న అనంతరం విరుష్క జంట బయటకు వచ్చి కారు ఎక్కేందుకు వీలు లేకుండా పోయింది. భద్రతా సిబ్బంది అభిమానులను నిలవరించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కారువద్దకు వెళ్లేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది.
ఓ అభిమాని అనుష్క తో సెల్ఫీ దిగేందుకు చాలా దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశాడు. అనుష్క శర్మ కారు డోరును కూడా తెరవడానికి స్థలం లేకపోయింది. వెంటనే పక్కనే కోహ్లి అతడిని వారించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో విరాట్ తన సహనం కోల్పోయాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అవడంతో.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. విరుష్క జంటకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారంటూ విరాట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Next Story