Fri Mar 28 2025 17:41:56 GMT+0000 (Coordinated Universal Time)
Virat Kohli : నువ్వు కావాలయ్యా సామీ.. అదే ధైర్యం.. అదే మా విజయం
ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగుమ్యాచ్ లలో భారత్ వరస విజయాలు సాధించిందంటే అందుకు విరాట్ కోహ్లీయే కారణమని చెప్పకతప్పదు

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్ లలో భారత్ వరస విజయాలు సాధించిందంటే అందుకు సార్ట్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీయే కారణమని చెప్పకతప్పదు. పాకిస్థాన్ మీద సెంచరీ చేసిన విరాట్ కోహ్లి నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో అతి విలువైన 84 పరుగులు చేయడంతోనే గెలుపు సాధ్యమయింది. ఈ టోర్నీకి ముందు విరాట్ కోహ్లిపై అనేక అనుమానాలు తలెత్తాయి. అనేక సందేహాలు కూడా నెలకొన్నాయి. ఫామ్ లో లేక విరాట్ ఇబ్బంది పడుతున్నారన్న విశ్లేషణలు కూడా వచ్చాయి. కానీ వాటిన్నింటినీ పటాపంచలు చేస్తూ రికార్డులను బ్రేక్ చేస్తూ విరాట్ కోహ్లి తన అభిమానుల మనసులో స్థానాన్ని మరింత పదిలపర్చుకున్నాడు.
వీక్ నెస్ అదే...
విరాట్ కోహ్లికి ఒక వీక్ నెస్ ఉంది. 25 పరుగులు దాటితే ఖచ్చితంగా హాఫ్ సెంచరీ చేస్తాడు. లేకుంటే ఈలోపు అవుటవుతారని, అలాగే 80 పరుగులు దాటితే సెంచరీ కూడా చేస్తాడని పేరుంది. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో బంతిని లేపి క్యాచ్ ఇచ్చి సెంచరీకి దూరమయ్యాడు. మరోసారి సెంచరీ చేసి భారత్ విజయంలో చివరకు వరకూ కోహ్లి ఉంటారని భావించిన ఫ్యాన్స్ కొంత నిరాశపడినా చివరకు భారత్ కు విజయం సాధ్యం కావడంతో సెంచరీ బాధను మాత్రం మర్చిపోయినట్లే. విరాట్ కోహ్లి క్రీజులో నిలబడితే చాలు ప్రత్యర్థికి వణుకు పుడుతుంది. ప్రతి బంతిని ఆచి తూచి ఆడటంలో విరాట్ కు సాటి మరెవ్వరూ ఉండరు. అందులోనూ ఒత్తడి సమయంలో మరింతగా రాణించడం అతనికి అలవాటు.
టార్గెట్ ఛేదనలో...
ఇక టార్గెట్ ఛేదనలో విరాట్ కోహ్లికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే కోహ్లిని అందరూ ఛేజింగ్ మాస్టర్ అని పిలుస్తుంటారు. విరాట్ కోహ్లి ఉన్నారంటే భారత్ విజయం దాదాపు ఖాయమయినట్లే. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అంచనాలు లేకుండా బరిలోకి దిగి, ఫామ్ లో లేరని విమర్శలు ఎదుర్కొన్న విరాట్ తన బ్యాట్ తోనే బదులు చెప్పినట్లయింది. అందుకే విరాట్ కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ప్రత్యర్థులు కూడా విరాట్ బ్యాటింగ్ ను ప్రశంసిస్తున్నారంటే అతనికి ఉన్న క్రేజ్ ఎలాంటిందో ఇంక వేరే చెప్పాల్సిన పనిలేదు. రేపు ఫైనల్స్ లో కూడా ఎవరు ప్రత్యర్థి అయినా విరాట్ నిలబడితే చాలు తమకు ట్రోఫీ దక్కినట్లేనని భావిస్తున్నారు క్రికెట్ అభిమానులు. చూద్దాం.. ఫైనల్ లో కోహ్లి ఎలా ఆడతారో?
Next Story