Sun Dec 22 2024 07:57:06 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2023 : విరాట్ విధ్వంసం వృథా.. ఐపీఎల్ నుండి ఆర్సీబీ అవుట్
ఈసారైనా ఐపీఎల్ కప్పు కొట్టాలన్న కల చెదిరిపోవడంతో.. కోహ్లీ కళ్లు చెమర్చాయి. ఆర్సీబీ అభిమానులు కూడా తీవ్రంగా..
ఐపీఎల్ 2023 సీజన్లో మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసే జట్టు భారీ స్కోర్ చేసినా.. వెనుక బ్యాటింగ్ చేస్తున్న జట్లు ఆ స్కోర్లను అవలీలగా చేధిస్తున్నాయి. ఆదివారం (మే21) జరిగిన మ్యాచ్ లోనూ ఇదే జరిగింది. ప్లే ఆఫ్స్ లో బెర్త్ ఖాయం చేసుకున్న గుజరాత్ టైటాన్స్ తో.. ప్లే ఆఫ్స్ కు తనకు ఎంతో కీలకమైన మ్యాచ్ ఆడి ఓడిపోయింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలిచి ఉంటే.. ప్లే ఆఫ్స్ కు చేరుకుని ఉండేది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో విరాట్, ఫాఫ్ డూప్లెసిస్ మంచి స్కోర్ చేశారు. శతకంతో.. విరాట్ విధ్వంసం సృష్టించినా.. అతని కష్టం వృథా అయింది. ఈసారైనా ఐపీఎల్ కప్పు కొట్టాలన్న కల చెదిరిపోవడంతో.. కోహ్లీ కళ్లు చెమర్చాయి. ఆర్సీబీ అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ చెందారు. 198 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ చేధించింది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. నాలుగు వికెట్లు మాత్రమే తీసి.. భారీగా రన్స్ ఇచ్చేశారు. గెలుస్తుందనుకున్న మ్యాచ్.. బౌలర్ల తీరు కారణంగా ఓడిపోయింది. మ్యాచ్ చివరిలో డగౌట్ లో కూర్చున్న కోహ్లీ.. ఆర్సీబీ ఓటమి తట్టుకోలేక కన్నీళ్లుపెట్టుకున్నాడు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జట్టు ఓడిపోయినా నువ్వెప్పటికీ మా కింగ్ వే అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Next Story