Sun Jan 12 2025 08:50:33 GMT+0000 (Coordinated Universal Time)
సూపర్ ఫీల్డింగ్ తో రనౌట్.. అద్భుతమైన క్యాచ్ తో అలరించిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ.. కేవలం బ్యాటింగ్ లోనే కాదు. ఫీల్డింగ్ లో కూడా దుమ్మురేపుతూ ఉంటాడు. ఈరోజు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓటమికి విరాట్ కోహ్లీ కూడా ఒక కారణమే..! ఒక సూపర్ రనౌట్.. ఒక అద్భుతమైన క్యాచ్ ను అందుకున్న కోహ్లీ భారత్ కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. సూపర్ ఫామ్ లో ఉన్న టిమ్ డేవిడ్ ను కోహ్లీ రనౌట్ చేయడం మ్యాచ్ కే హైలైట్. అద్భుతమైన డైరెక్ట్ త్రో తో టిమ్ డేవిడ్ ను పెవిలియన్ చేర్చాడు కోహ్లీ.
18.2 :
హర్షల్ పటేల్ బౌలింగ్ లో జోష్ ఇంగ్లిస్ ఆడుతూ ఉండగా.. అనవసరమైన పరుగుకు ప్రయత్నించడంతో టిమ్ డేవిడ్ రనౌట్ గా వెనుదిరిగాడు. స్ట్రైక్ లోకి వద్దామని డేవిడ్ ప్రయత్నించగా.. కోహ్లీ డైరెక్ట్ త్రో వేసి పెవిలియన్ కు పంపాడు.
19.3
షమీ బౌలింగ్ లో కమిన్స్ భారీ షాట్ ఆడడానికి ప్రయత్నించగా లాంగ్ ఆన్ లో ఉన్న కోహ్లీ అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. సింగిల్ హ్యాండ్ తో కోహ్లీ క్యాచ్ ను పూర్తీ చేసి ఔరా అనిపించాడు. వన్ హ్యాండ్ స్టన్నర్ తో మ్యాచ్ ను భారత్ వైపు తిప్పాడు కోహ్లీ. షమీ లో ఫుల్-టాస్ వేయగా కమ్మిన్స్ భారీ షాట్ ఆడాడు.. అప్పుడు బౌండరీ రోప్స్ వద్ద ఉన్న కోహ్లీ.. అప్పటికే కాస్త ముందుకు వచ్చేశాడు.. ఆ బంతి తన మీదుగా వెళుతోందని భావించిన కోహ్లీ.. పెర్ఫెక్ట్ జంప్ చేయడంతో అద్భుతమైన క్యాచ్ ను పట్టేసుకున్నాడు.
Next Story