విరాట్ కోహ్లీ ఆస్తులు ఎంతంటే?
కోహ్లీ ప్రాపర్టీస్ విలువు రూ.110 కోట్లుగా మ్యాగ్జైన్ ప్రచురించింది. ముంబైలో రూ.34 కోట్లు విలువ చేసే ఇల్లు, గుర్గామ్లో రూ.80 కోట్ల విలువైన
టీమిండియా మాజీ సారథి 'విరాట్ కోహ్లీ' ఆస్తుల గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. కోహ్లీ సంపాదనలోనూ అందరికంటే ముందున్నాడు. విరాట్ కోహ్లీ సంపాదనకు సంబందించిన వివరాలను ఓ మ్యాగ్జైన్ తన కవర్ పేజీమీద ప్రచురించింది. ఆ లెక్కల ప్రకారం కోహ్లీ నికర ఆదాయం రూ.1050 కోట్లుగా ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో ఈ స్థాయిలో నికర ఆస్తి కలిగిన ఏకైక ఆటగాడు ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమేనని ఆ సంస్థ పేర్కొంది. 34 యేళ్ల కోహ్లీ.. బీసీసీఐ కాంట్రాక్టుల జాబితాలో 'ఏ' గ్రేడ్లో ఉన్నారు. ఆయనకు సంవత్సరానికి రూ.7 కోట్ల మేరకు పారితోషికం అందుకుంటున్నారు. ప్రతి టెస్ట్ మ్యాచ్కు రూ.15 లక్షలు, వన్డేకు రూ.6 లక్షలు, టీ20కి రూ.3 లక్షలు చొప్పున మ్యాచ్ ఫీజ్ అందుకుంటున్నారు. ఐపీఎల్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహించినందుకు రూ.15 కోట్లు ప్రతి ఏడాది కోహ్లీ అందుకుంటూ ఉన్నాడు. వాణిజ్య ప్రకటనలు, పలు బ్రాండ్లకు ప్రచారకర్తలుగా ఉన్నందుకు భారీ మొత్తంలో నగదు అందుకుంటున్నారు. ఇలా 18కి పైగా బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్న కోహ్లీకి యేడాదికి రూ.7.50 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేరకు సంపాదిస్తున్నాడు.