Sun Dec 22 2024 17:10:35 GMT+0000 (Coordinated Universal Time)
INDvsBAN Hyderabad: హైదరాబాద్ లో టీ20 మ్యాచ్ ను అడ్డుకుంటాం: వీహెచ్పీ
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ను అడ్డుకుంటామని
అక్టోబర్ 12, శనివారం హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ను అడ్డుకుంటామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) నేతలు హెచ్చరించారు. బంగ్లాదేశ్లో హిందువులు ఎంతో హింసకు గురవుతున్నారని, అలాంటి దేశంతో మ్యాచ్ను నిర్వహించడానికి ప్రభుత్వం అనుమతించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను ఎత్తిచూపేందుకు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ను అడ్డుకుంటామని వీహెచ్పీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. మ్యాచ్కు ప్రభుత్వం అనుమతిని రద్దు చేయాలని, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని తెలిపారు.
పోలీసులు ఇప్పటికే వేదిక వద్ద, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ పోలీసులు ఉప్పల్ స్టేడియంలో దాదాపు 2,600 మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 400 మంది ట్రాఫిక్ అధికారులు, 1,662 మంది శాంతి భద్రతల సిబ్బంది, TSSP నుండి అదనపు ప్లాటూన్లతో పాటు భద్రతా విభాగం నుండి 250 మంది సభ్యులతో సహా వివిధ విభాగాల నుండి సిబ్బందిని తీసుకున్నారు.

Next Story