Fri Dec 20 2024 06:27:49 GMT+0000 (Coordinated Universal Time)
సన్ రైజర్స్ కు ఎదురుదెబ్బ.. సీజన్ మొత్తానికీ ఆ స్టార్ ప్లేయర్ దూరం
సన్ రైజర్స్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని
ఐపీఎల్ 2023లో కొన్ని జట్లు తమ పేలవ ఆట తీరుతో అభిమానులను నిరాశపరుస్తున్నాయి. వాటిలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా ఒకటి. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్.. కేవలం రెండంటే రెండే మ్యాచ్ లు గెలిచి.. ఐదు మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆఖరి మూడు మ్యాచ్ లలో సన్ రైజర్స్ వరుసగా ఓటమి పాలై అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. గ్రౌండ్ లో ఎదురుదెబ్బలు తింటున్న సన్ రైజర్స్ జట్టుకు.. ఇప్పుడో స్టార్ ప్లేయర్ రూపంలో మరో షాక్ తగిలింది.
సన్ రైజర్స్ జట్టులో స్టార్ ఆల్ రౌండర్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికీ దూరమయ్యాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ ఫ్రాంచైజీ అధికారికంగా తెలుపుతూ ట్వీట్ చేసింది. సుందర్ కాలు కండరాల గాయానికి గురయ్యాడని తెలిపింది. దాంతో, లీగ్ దశలో మిగిలిన ఏడు మ్యాచ్ ల్లో సుందర్ సేవలను హైదరాబాద్ కోల్పోనుంది. స్పిన్నర్ స్పెషలిస్ట్ అయిన సుందర్..తన బ్యాటింగ్ తోనూ సత్తా చాటుతూ కీలకమైన ప్లేయర్ గా మారాడు. ఇప్పుడు జట్టు అతడిని కోల్పోవడం తీరని లోటుగా మిగలనుంది. అతని స్థానంలో మరో ప్లేయర్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ తీసుకుంటుందో లేదో చూడాలి.
Next Story